చెక్ (Czech) దేశానికి ప్రధానమంత్రి(Prime Minister)గా ఆండ్రేజ్ బాబిస్ (Andrej Babis) మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఈయన ఒక బిలియనీర్(Billionaire). అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుదారుడు(Supporter Of Trump). కాబట్టి ఉక్రెయిన్‌కి సహాయం నిలిచిపోయే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు కూడా మరింత దిగజారే ప్రమాదం ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన చెక్ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచిన బాబిస్.. మరో రెండు యూరోసెప్టిక్ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. 2022 నుంచి రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు సహాయాన్ని తగ్గించాలని బాబిస్ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నాడు. కానీ.. ఇప్పటివరకు అధికారంలో ఉన్న సెంటర్ రైట్ ప్రభుత్వం మానవతా, సైనిక సహాయాన్ని అందిస్తూ వచ్చింది. కానీ.. ఆండ్రేజ్ బాబిస్ మాత్రం తననుతాను ట్రంపిస్ట్(Trumpist)గా అభివర్ణించుకున్నాడు. ఫోర్బ్స్ సంస్థ గణాంకాల ప్రకారం ఇతను చెక్ దేశంలోని అత్యంత ధనవంతుల్లో 7వ వాడు. ఈయూ, నాటో సభ్య దేశమైన చెక్ రిపబ్లిక్‌ను ఆండ్రేజ్ బాబిస్.. 2017 నుంచి 2021 వరకు పరిపాలించాడు. అతణ్ని అధ్యక్షుడు పీటర్ పావెల్.. మళ్లీ దేశ ప్రధానిగా నియమించాడు.
Czech | చెక్ ప్రధానిగా మళ్లీ ఆండ్రేజ్ బాబిస్
- Advertisement -
RELATED ARTICLES
