Friday, February 27, 2026
Homeఆజ్ కీ బాత్Andesri | జయ జయహే తెలంగాణ జనని జయకేతనం

Andesri | జయ జయహే తెలంగాణ జనని జయకేతనం

జయ జయహే తెలంగాణ జనని జయకేతనం గీతంతో తెలంగాణ ఆత్మకు స్వరం ఇచ్చిన మహాకవి అందెశ్రీ. పల్లెలో పుట్టి, ప్రజల గుండెల్లో పెరిగి, ఉద్యమానికి దీపం వెలిగించినవాడు. ఒక గీతంతో ఉద్యమాన్ని జ్వలింపజేసి, రాష్ట్రానికి ఆత్మను నింపినవాడు. అక్షరాలే ఆయుధాలుగా మారిన కవి, మన తెలంగాణ గర్వకారకుడు. మట్టి వాసనలో మమేకమై, మానవత్వాన్ని పాడిన కవిత్వరాజు. ప్రజల బతుకు బాటలో నడిచిన గీతరచయితకు కోట్ల వందనాలు. “జయ జయహే” ప్రతి పలుకులో నీ శ్వాస, నీ భావం ఇంకా మోగుతూనే ఉంది. నీ గీతం మాదిరే నీ పేరు కూడా చరిత్రలో చెరగని అక్షరంగా నిలిచిపోతుంది. తెలంగాణ ఆత్మలో శాశ్వతంగా నిలిచిన అందెశ్రీకి ఆదాబ్ హైదరాబాద్ అశ్రు నివాళులు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News