Friday, February 27, 2026
HomeసినిమాAnaganaga Oka Raju | ప్రేక్షకులకు నవీన్‌ పొలిశెట్టి కృతఙ్ఞతలు

Anaganaga Oka Raju | ప్రేక్షకులకు నవీన్‌ పొలిశెట్టి కృతఙ్ఞతలు

సంక్రాంతి(Sankranthi)కి ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి(Navin Polishetti) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కథానాయిక.

భారీ అంచనాలతో సంక్రాంతికి జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కడుపుబ్బా నవ్వించడమే(Comedy) కాకుండా భావోద్వేగమైన(Sentiment) సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని అసలు సిసలైన పండగ సినిమాలా ఉందని ‘అనగనగా ఒక రాజు’ చూసిన ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల భారీ వసూళ్లతో(Huge Collections) సంచలనం సృష్టించింది. ప్రేక్షకుల సంపూర్ణ మద్దతుతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తున్న(Box Office Hit) నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్(Thankyou Meet) నిర్వహించి ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News