Wednesday, February 11, 2026
Homeఅంతర్జాతీయంWHO | డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగిన అమెరికా

WHO | డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగిన అమెరికా

అమెరికా(America) ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization-WHO) నుంచి వైదొలగింది(Exits). ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఏడాది కిందట ప్రకటన చేయగా అదిప్పుడు ఖరారైంది. దీంతో ఈ రెండింటి మధ్య ఉన్న 78 ఏళ్ల అనుబంధం ముగిసింది. 2024, 2025లో అమెరికా డబ్ల్యూహెచ్ఓకి చెల్లించాల్సిన 133 మిలియన్ డాలర్లకు పైగా నిధులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం లెక్కల ప్రకారం ఆ దేశం WHOకి ఏటా సభ్య బకాయిల రూపంలో 111 మిలియన్ డాలర్లు, వార్షిక స్వచ్ఛంద విరాళాల రూపంలో దాదాపు 570 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. కానీ.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక.. డబ్ల్యూహెచ్ఓ విధానాలు నచ్చకపోవటంతో ఆ సంస్థను దూరం పెట్టారు. WHO ప్రాయోజిత కమిటీలు, నాయకత్వ సంస్థలు, పాలనా నిర్మాణాలు, సాంకేతిక వర్కింగ్ గ్రూపుల్లో అధికారికంగా పాల్గొనడాన్ని నిలిపివేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News