Tuesday, October 28, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్భారతదేశ ఆత్మ గౌరవం

భారతదేశ ఆత్మ గౌరవం

జగం మెచ్చిన నాయకుడు
జనం నచ్చిన నాయకుడు
భరత మాత పుత్రుడు
దళిత జాతి సూర్యుడు
బాబా అంబేద్కరుడు
మను చరిత్రపై దండయాత్ర
మరువని భారత చరిత్ర
సమ సమాజానికై సాగినయాత్ర
అంతులేని మీ సేవల గాథ
రాజ్యాంగ రచనకు రథసారధి
ఆదర్శాల నిర్మాణ వారధి
భారత భాగ్య విధాత
మా ఉజ్వల భవిష్యతు ప్రధాత
మీ ఆశయాలకై మా నిత్య గమనం
మీ స్ఫూర్తితో సాగుతాము నిశ్చయం
బహుజనులకు అంతులేని గౌరవం
భారతదేశ ఆత్మ గౌరవం

  • బొల్లం బాలకృష్ణ
RELATED ARTICLES
- Advertisment -

Latest News