- ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిరసన
- అంబటి ఫ్లెక్సీ ఫోటోకి ఫినాయిల్ తో నిరసన తెలిపిన చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాస్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లి గారిపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి ఆంబటి రాంబాబుపై చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ & స్కూల్ ఆఫ్ సీబీఎన్ సంయుక్త ఆధ్వర్యంలో రాంబాబు ఫ్లెక్సీ ఫొటోకు ఫినాయిల్‌తో నోరు కడిగి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాస రావు మాట్లాడుతూ,ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ ఇంకా నీచమైన పదజాలంతో రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు.ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆంబటి రాంబాబుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాజకీయాలలో ప్రజాస్వామ్యబద్ధమైన విమర్శలు ఉండాలని,కానీ హద్దులు దాటి అమ్మ,చెల్లి అని తేడా లేకుండా మాట్లాడే నాయకులను ప్రజలు రానున్న రోజుల్లో రాజకీయంగా అడ్డుకుంటారని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి.వేణు,సైదులు,కళ్యాణ్,విష్ణు,మహేష్,నరేందర్,రాం,హరీష్,పవన్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
