Friday, October 3, 2025
ePaper
Homeజాతీయంప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

కశ్మీర్‌ హిమాలయ పర్వతాల్లో మంచులింగం రూపంలో కొలువైన శివుడ్ని భక్తులు దర్శించుకునేందుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. యాత్ర మారాల్లో గగనతలంపై నుంచి కూడా పర్యవేక్షణ సాగుతోంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 9 నాటికి పూర్తవుతుంది. 3880 విూటర్ల ఎత్తులో ఉండే గుహలో ఉన్న ఈ క్షేత్రానికి గురువారం మొదటి బ్యాచ్‌ భక్తులు బల్తాల్‌, నున్‌వాన్‌ శిబిరాల నుంచి బయలుదేరారు. అనంతనాగ్‌ లోని పహల్గాం లో నున్‌వాల్‌ శిబిరం నుంచి 48 కివిూ రూటు నుంచి, సెంట్రల్‌ కశ్మీర్‌ లోని గండెర్‌బాల్‌ సోనామార్గ్‌ ఏరియా14 కివిూ బల్తాల్‌ రూటు నుంచి గురువారం తెల్లవారు జామున బయలుదేరారు. యాత్రికులు ’భంభం బోలే.. హరహరమహాదేవ్‌’ నినాదాలతో ముందుకు సాగారు. ముందుగా భరించలేని వాతావరణంలో కష్టతరమైన మార్గం ఉన్నా వారి ముఖాల్లో ఆనందం తొంగి చూసింది.

యాత్రి కులు తమకు కట్టుదిట్టమైన భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. యాత్రికులతోపాటు కేంద్ర మంత్రి శోభ కరండ్లజే కూడా బల్తాల్‌ రూటులో బయలుదేరారు. బుధవారం జమ్ము లోని భగవతి నగర్‌ శిబిరం నుంచి మొదటి బ్యాచ్‌ 5892 మంది యాత్రికులు బయలుదేరారు. లెప్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. యాత్రికులు మధ్యా హ్నం కశ్మీర్‌ లోయకు చేరుకోగానే అధికారవర్గాలు, స్థానికులనుంచి వారికి ఘనమైన స్వాగతం లభించింది. గత ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడిలో 22 మంది తుపాకీ కాల్పులకు బలైపోయిన దుర్ఘటన దృష్టా భక్తులకు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఉండేందుకు గట్టిభద్రతా ఏర్పాట్లు జరిగాయి. పోలీస్‌, పారామిలిటరీ విభాగాల నుంచి వేలాది మంది భద్రత సిబ్బందిని నియమించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News