Monday, January 19, 2026
EPAPER
Homeఎన్‌.ఆర్‌.ఐAllu Arjun | సెన్సోజీ గుడిలో అల్లు అర్జున్ ఫ్యామిలీ

Allu Arjun | సెన్సోజీ గుడిలో అల్లు అర్జున్ ఫ్యామిలీ

టోక్యో(Tokyo)లోని సెన్సోజీ ఆలయాన్ని(Sensoji Temple) టాలీవుడ్ హీరో(Tollywood Hero) అల్లు అర్జున్ కుటుంబ(Family) సమేతంగా సందర్శించారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral In Social Media) అవుతున్నాయి. తమకు ఇష్టమైన నటుడు ఆ చారిత్రాత్మక గుడిలో గడిపిన ఆధ్యాత్మిక క్షణాలు అభిమానులను ఆనందపరిచాయి. ఇంటర్నేషనల్ ప్రమోషనల్ టూర్‌కి వెళ్లిన అల్లు అర్జున్ తన వ్యక్తిగత జీవితాన్ని ఇలా ఎంజాయ్ చేస్తుండటం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. జపాన్ రాజధాని(Japan Capital) టోక్యోకి చేరుకున్నవారిలో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, అయాన్ ఉన్నారు. స్టైలిష్ స్టార్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప: ది రూల్’(Pushpa) కొన్ని రోజుల కిందట జపాన్‌లో థియేటర్లలోకి వచ్చింది. దీంతో ఆ మూవీ రిలీజ్‌ను ప్రమోట్ చేయడానికి ఆయన ప్రస్తుతం టోక్యోలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News