1507 దరఖాస్తులు. దక్కింది 74 మందికి
పెద్దపల్లి జిల్లాలో రెండేళ్ల కాలానికి 74 మద్యం (ఏ4) షాపుల కేటాయింపు (Allotment) ప్రక్రియ సోమవారం లాటరీ (Lottery) పద్ధతి ద్వారా విజయవంతంగా పూర్తయింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ సమక్షంలో బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌లో ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. 74 షాపుల కోసం మొత్తం 1507 దరఖాస్తులు రాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గౌడ (Gouds) కులస్థులకు 13, ఎస్సీ(Sc)లకు 8 షాపులు రిజర్వ్ (Reserve) చేశారు. మిగిలిన 53 షాపులను జనరల్ కేటగిరీ(General Category)లో లాటరీ ద్వారా దరఖాస్తుదారులకు కేటాయించారు. షాపులు దక్కించుకున్నవారు వెంటనే వార్షిక ఎక్సైజ్ పన్నులో 6వ వంతు చెల్లించి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావుతోపాటు దరఖాస్తుదారులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






