పూటకో వేషంతో అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తున్న చండ్ర చంద్రశేఖర్
- అనుమతులు ముందు.. ఆ తరువాత పర్మిషన్‌కు అప్లికేషన్
- స్వర్గసీమ సుకేతనలో లేనివి ఉన్నట్లు చూపుతూ కలరింగ్
- అక్రమ వెంచర్ అంటూ రెండు సార్లు నోటీసులు జారీ
- నాలా కన్వర్షన్ కాలేదని తెలుపుతున్న భూ భారతీ రికార్డ్స్
- పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం ఆన్లైన్లో నేటికి లేని అనుమతి.. మాన్యువల్ అనుమతి చెల్లదు అంటున్న పంచాయతీ రాజ్ చట్టం..
- ఓఆర్సీ లేకుండా ఇనాం భూమి పట్టా చేసుకున్న చండ్ర
- అక్రమ వెంచర్లో సైన్ బోర్డు ఏర్పాటు చేసి, కఠిన చర్యలు చేపడుతామన్న రంగారెడ్డి జిల్లా డీపీఓ
ఎక్కడైనా దరఖాస్తు చేసిన తరువాత పరిశీలించి అనుమతులు జారీ చేస్తారు.. కానీ స్వర్గసీమ సుకేతనలో సీన్ రివర్స్ అయ్యింది.. ముందు అనుమతులు లభించాయి.. ఆ తరువాత దరఖాస్తు చేసుకున్నారు.. ఇదెలా సాధ్య అయ్యిందో ఆ భగవంతుడికే తెలియాలి.. ఇంత పచ్చిగా జనాలను మోసం చేసిన చంద్ర చంద్రశేఖర్ తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..అలాగే అతగాడికి సహకరించిన అధికారుల కాళ్ళు మొక్కాల్సిందే..


కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వానికి, అధికారులకు జోహార్లు చెప్పాల్సిందే.. ఈ వింత ఘటన స్వర్గసీమ సుకేతన వెంచర్ ఓ చోటుచేసుకుంది..15052023 రోజున లే అవుట్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు.. చెరుకుపల్లి గ్రామ కార్యదర్శి అశోక్ 01052023 రోజున డిటిసిపి నుండి మ్యానువల్ అనుమతి ఉన్నట్లు తెలుపుతూ.. తేదీ 22052023 రోజున మ్యానువల్ గా అనుమతి ఇచ్చాడు.. ఓర్నీ ఇంతకు తెగించార్రా మీరు అంటున్నారు సామాజిక వేత్తలు.. జరిగిన అక్రమ వ్యవహార వివరాలు మీ కోసం..
రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం, చెరుకుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్వర్గసీమ సుకేతన పేరుతో వెలిసిన అక్రమ వెంచర్.. కాసుల కోసం పూటకో వేషం వేస్తూ అమాయక ప్రజలకు బురిడి కొట్టిస్తు మోసాలకు పాల్పడుతున్న చండ్ర చంద్రశేఖర్ అక్రమ వ్యవహారం ‘ఆదాబ’ ఆధారాలతో వెలుగులోకి తీసుకొని వచ్చింది. ఆదాబ్ కథనాలతో స్పందించి విచారణకు ఆదేశిం చారు రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి.. డీపీఓ ఆదేశాల మేరకు డీఎల్పీఓ, ఎంపీఓలు కలసి.. అవినీతి మత్తులో మునిగి పోయి ఆ వైపు కన్నెత్తి చూడని చెరుకుపల్లి గ్రామ కార్యదర్శి అశోక్‌ని మోఖాపై విచారణకు తీసుకెళ్లారు..


అధికారుల విచారణలో స్వర్గసీమ సుకేతన పేరుతో చేస్తున్న వెంచర్ అసలు బాగోతం బట్టబయ లైంది.. చంద్రశేఖర్ చేస్తున్న మోసాలను గుర్తించి అక్రమ వెంచర్ అంటూ.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా మని లెటర్ నెంబర్ జిపి/02/2026,తేది : 17/02/2026 న మొదట నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు కార్యదర్శి అశోక్..
ఇక రెండోసారి సైతం అక్రమ వెంచర్ పై జీపి/04/2026 గల నోటీస్ తేది 02032026 గల నోటీస్ ఇచ్చి నెల దాటినా ఆ వైపు కన్నెత్తి చూడలేదు సదరు కార్యదర్శి అశోక్.. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం పంచాయతీ కార్యాలయ వెబ్సైట్ లో స్వర్గసీమ వారు లే అవుట్ అనుమతి కోసం అప్లికేషన్ నెంబర్ 1875 తేది : 14042023న దరఖాస్తు చేసుకున్నారు.. కానీ నేటికీ అనుమతి లేదని స్పష్టంగా ఈ పంచాయితీ వెబ్సైట్ లో కనిపిస్తోంది..

కాగా 2018 ఏప్రిల్ 12 వ తేదీ తరువాత పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 144 ప్రకారం ఆన్లైన్ లోనే అనుమతి పొందాలి తప్ప మ్యాన్యువల్ గా అనుమతి పొందితే అది చట్ట విరుద్ధంగా పొందిన అనుమతి కిందకు వస్తుందని, అది అసలు చెల్లనేరదు అని ఏ అధికారిని అడిగినా చెబుతారు.. పైగా సదరు వెంచర్ లో చూపిన సర్వే నెంబర్ లు భూ భారతిలోని రికార్డులు పరిశీలిస్తే అవి నేటికీ వ్యవసాయ భూములుగానే ఉండటం, నాలా కన్వర్షన్ లేకుండానే మాన్యువల్ గా అనుమతి పొందినట్లు స్పష్టం అవుతోంది..
తీగ లాగితే కదులుతున్న డొంక.. :
మాన్యువల్ గా లే అవుట్ అనుమతి పొంది, తరువాత లే అవుట్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న చండ్ర చంద్రశేఖర్..
చెరుకుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో లే అవుట్ అనుమతి కోసం ఆన్ లైన్ లో చేసుకున్న దరఖాస్తుకు నేటికి అనుమతి లేదు.. పంచాయతీ రాజ్ చట్ట నిబంధనలు ఉల్లంఘించి వక్ర మార్గంలో మ్యానువల్ గా ఎందుకూ పనికిరాని అనుమతి తీసుకొని మోసాలకు పాల్పడుతున్నాడు చండ్ర చంద్ర శేఖర్..


అడ్డంగా దొరికిపోయిన స్వర్గసీమ వెంచర్ యజ మాని చండ్ర చంద్రశేఖర్.. మ్యానువల్ గా అనుమతి పొందిన దాంట్లో తేదీ చూస్తే 15052023 రోజున లే అవుట్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు.. కాసులకు కక్కుర్తి పడ్డ నాటి కార్యదర్శి 01052023 రోజున డిటిసిపి నుండి మ్యానువల్ అనుమతి ఉన్నట్లు తెలుపుతూ.. తేదీ 22052023 రోజున మ్యానువల్ గా అనుమతి ఇచ్చాడు.. ఇదెలా సాధ్యమో అతగాడి చెప్పాలి..
ఒక వైపు నాలా కన్వర్షన్ లేదు.. ఆన్ లైన్లో దరఖాస్తుకు అనుమతి లేదు.. ఆన్ లైన్లో ఆధారాలు కళ్లెదుటే కనబడుతున్నా సదరు కార్యదర్శిని ఉన్నతాధికారులు ఎందుకు సస్పెండ్ చేయడం లేదనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి..
