- రెవెన్యూ శాఖలో 13 మంది కళంకిత అధికారులకు అందలం!
- భూ కుంభకోణాలు, ఏసీబీ, విజిలెన్స్ విచారణలున్నా ఆగని పదోన్నతి
- పారదర్శకతపై నీలినీడలు.. ప్రభుత్వ జీ.ఓ. 620పై తీవ్ర దుమారం
- విచారణలు పెండింగ్.. ప్రమోషన్లు మాత్రం పక్కా!
- తీవ్ర అవినీతి, భూ అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే పెద్ద పీట
- పాత ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులకే మళ్లీ కీలక స్థానాలు
- రూ. 3.50 కోట్ల దుర్వినియోగం నుంచి యుఎల్సీ అక్రమాల వరకు..
- ఏళ్ల తరబడి సాగుతున్న విచారణలు.. ప్రభుత్వ నిర్లక్షంపై విస్మయం
రెవెన్యూ శాఖలో పలువురు వివాదాస్పద అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులు కల్పించడం పెను దుమారం రేపుతోంది. తీవ్రమైన అవినీతి ఆరోపణలు, భూ కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై విచారణలు ఎదుర్కొంటున్న 13 మంది డిప్యూటీ కలెక్టర్లకు ‘స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్’లుగా ప్రమోషన్ ఇస్తూ ప్రభుత్వం అక్టోబర్ 15, 2025న జీ.ఓ.ఆర్.టి. నెం. 620 జారీ చేసింది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పారని, కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులే ఈ జాబితాలో కీలంగా ఉండటం గమనార్హం.
- కీలక ఆరోపణలు… రాజకీయ అండదండలు?
గత ప్రభుత్వ హయాంలో కె. చంద్రకళ, శేరిలింగంపల్లి ఎమ్మార్వోలుగా పనిచేసిన అధికారులు కొందరి కనుసన్నల్లో పనిచేస్తూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
కె. చంద్రకళ షేక్ పేట్ ఎమ్మార్వోగా, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, ప్రస్తుతం చెవేళ్ల ఆర్డీఓగా పనిచేసిన ఈమె, కోట్ల రూపాయలు దండుకొని జీవో-59 కింద ప్రభుత్వ ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించినట్లు ఆరోపణలున్నాయి. అమోయ్ కుమార్ దొరికినప్పటికీ, చంద్రకళ మళ్లీ చక్రం తిప్పుతున్నారని, ప్రస్తుతం ప్రభుత్వానికి సరెండర్ అయి మళ్లీ అక్రమ దందాలు మొదలుపెట్టారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
- శేరిలింగంపల్లి ఎమ్మార్వోలు: గత ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు ఎమ్మార్వోలు (ప్రస్తుత ప్రమోషన్ల జాబితాలోని ఎం. వంశీ మోహన్, ఎం. వాసుచంద్ర) స్థానిక ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతూ వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. ఖాజాగూడలోని బీసీ స్టడీ సర్కిల్ భూమి అన్యాక్రాంతం కావడంలో వీరిది కీలక పాత్ర అని, వీరంతా అమోయ్ కుమార్ తో కలిసి దందాలు చేసినవారేనని సమాచారం.
ప్రమోషన్ పొందిన అధికారులపై ఉన్న అభియోగాలు
ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారమే, ప్రమోషన్ పొందిన పలువురిపై తీవ్రమైన అభియోగాలు, శాఖాపరమైన విచారణలు పెండింగ్లో ఉన్నాయి.
- కె. చంద్రకళ
ఈమెపై 2013 నుంచి 2019 మధ్య కాలంలో ఐదు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.
ఆలయ భూమి విక్రయం (VS-I(2)/396/2017 ఆసిఫ్ నగర్ తహశీల్దార్ జీహెచ్ఎంసీ అధికారులతో కుమ్మక్కై ఆలయ భూమిని విక్రయించారని ఫిర్యాదు. 2017 నుండి కలెక్టర్ నివేదిక పెండింగ్లో ఉంది.
ప్రభుత్వ భూమిలోని గుడిసెల నుండి పేదలను బలవంతంగా ఖాళీ చేయించి, కూల్చివేశారని ఆరోపణ (VS-(2)/1519/2017 2017 నుండి నివేదిక పెండింగ్లో ఉంది.
- యుఎల్సీ అక్రమాలు
(VS-I(2)/175/2019): ఆర్డీవో
గా యుఎల్సీ కమిటీ చైర్పర్సన్గా ఉంటూ శేరిలింగంపల్లి భూమి విషయంలో అక్రమ ఉత్తర్వులు జారీ చేశారని ఫిర్యాదు. ఈ కేసుపై విచారణ పెండింగ్లో ఉంది.
పట్టా సర్టిఫికెట్ల జారీలో అన్యాయం (VS-1(2)/24/2013): వ్యక్తులకు పట్టా సర్టిఫికెట్లు జారీ చేయకుండా. అన్యాయం చేశారని 2013లో ఫిర్యాదు. దీనిపై నివేదిక ఇంకా రావలసి ఉంది.
- ఎం. వంశీ మోహన్
గతంలో శేరిలింగంపల్లి ఎమ్మార్వోగా పనిచేసిన ఈయనపై ప్రభుత్వ భూముల రక్షణలో విఫలమయ్యారన్న ఆరోపణలపై పలు కేసులున్నాయి.
໖ (VS-1(2)/129/2022)
ఖాజాగూడ గ్రామంలో బీసీ స్టడీ సర్కిల్కు కేటాయించిన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించడంలో విఫలమయ్యారని విజిలెన్స్ నివేదిక ఆరోపించింది. ప్రభుత్వ ఉత్తర్వులు రావలసి ఉంది.
ప్రభుత్వ భూమి రక్షణలో వైఫల్యం (VS-1(2)/126 /2020): ఖానామెట్ గ్రామంలో భూ ఆక్రమణదారులపై కేసు నమోదు చేయడంలో విఫలమయ్యారు. ప్రభుత్వం అభియోగ పత్రాలు (Charge Memo) జారీ చేసింది.
ລ້ ໖ (VS-1(2)/2321929/2023): బేగంపేటలోని ప్రభుత్వ సీలింగ్ మిగులు భూమిని రక్షించలేదని ఆరోపణ. ప్రభుత్వ ఉత్తర్వులు పెండింగ్లో ఉన్నాయి.
ఎం. వాసుచంద్ర
ఈయన కూడా శేరిలింగంపల్లిలో పనిచేసిన వారే. ఈయనపై కూడా చంద్రకళ, వంశీ మోహన్లతో ఉన్న ఉమ్మడి కేసులు ఉన్నాయి.
(VS-I(2)/175/2019):
చంద్రకళతో పాటు యుఎల్సీ కమిటీలో సభ్యునిగా ఉంటూ అక్రమ ఉత్తర్వులపై సంతకాలు చేశారని ఆరోపణ. విచారణ పెండింగ్లో ఉంది.
బీసీ స్టడీ సర్కిల్ భూమి (VS-1(2)/129/2022): వంశీ మోహన్ తో పాటు ఖాజాగూడ బీసీ స్టడీ సర్కిల్ భూమిని రక్షించడంలో విఫలమయ్యారని ఆరోపణ. ప్రభుత్వ ఉత్తర్వులు రావలసి ఉన్నాయి. - సిహెచ్. వెంకటేశ్వర్లు
ఈ అధికారిపై ఏకంగా ఆరు వేర్వేరు కేసులు పెండింగ్లో ఉన్నాయి.
రూ. 3.50 కోట్ల దుర్వినియోగం (VS-1(2)/3147888/2025): 44 చెక్కుల ద్వారా రూ.3.50 కోట్ల ప్రభుత్వ ధనాన్ని మోసపూరితంగా డ్రా చేసి దుర్వినియోగం చేశారని విజిలెన్స్ నివేదిక ఆరోపించింది.
అక్రమ ఇసుక రవాణా (VS-1(2)/163/2021): మద్దూరు, మక్తల్ మండలాల్లో అక్రమ ఇసుక డంపులు, రవాణాకు సంబంధించి అభియోగ పత్రాలు జారీ చేయబడ్డాయి.
వేధింపుల ఆరోపణ (VS-III(1)/1141/2016); హిమాయత్ నగర్ తహశీల్దార్ మహిళా ఉద్యోగులను వేధించారని అజ్ఞాత పిటిషన్. 2016 నుండి కలెక్టర్ నివేదిక పెండింగ్లో ఉంది.
వీరే కాకుండా, జాబితాలోని బోయపాటి చెన్నయ్యపై నాలా దరఖాస్తును ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెట్టినందుకు ఏసీబీ అభ్యర్ధన మేరకు విచారణ నడుస్తోంది. ఎం. సూర్య ప్రకాష్ పై 2007 నాటి నుండే అనర్హులకు ప్రభుత్వ మిగులు భూమిని ప్రాసెస్ చేశారన్న కేసు విచారణలో ఉంది. కె. వెంకట ఉపేందర్ రెడ్డి పై కూడా ఏసీబీ సిఫార్సు మేరకు శాఖాపరమైన చర్యలు పెండింగ్లో ఉన్నాయి. - జవాబుదారీతనం ఏది?
ఇంతటి తీవ్రమైన ఆరోపణలు,
సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న విచారణలు ఉన్నప్పటికీ, సదరు అధికారులకు పదోన్నతులు కట్టబెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డా రన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే, కొత్త ప్రభుత్వంలోనూ కీలక స్థానాలు పొందడం ప్రభుత్వ పారదర్శకతపై, జవాబుదారీతనంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.
