Tuesday, February 10, 2026
Homeనల్లగొండMothkur | మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం

Mothkur | మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం

  • ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపు
  • మొత్తం పోలింగ్ సిబ్బంది 126 మంది
  • అదనపు కలెక్టర్ భాస్కరరావు

మోత్కూరు మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం పోలింగ్ సిబ్బంది కి విధులు కేటాయించినట్లు అదనపు కలెక్టర్ భాస్కరరావు, అడిషనల్ పిడి సురేష్ తెలిపారు.రేపు నిర్వహించే బోయె పోలింగ్ కొరకు సన్నదమైన ఎన్నికల సిబ్బంది.పోలింగ్ నిర్వహించేందుకు 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 17 కేంద్రాలకు గాను పోలింగ్ సెంటర్లు 26. ప్రిసైడింగ్ అధికారులు 26 మంది విధులు నిర్వహిస్తుండగా 6 గురు రిజర్వులో ఉంటారు.వీరితో పాటు 26 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు 6 గురు రిజర్వ్ లో ఉంటారు.

ఓపిఓ లు 32 మంది గాక 32 మంది ని రిజర్వులో కేటాయించారు.మొత్తం పోలింగ్ సిబ్బంది 126 మంది.సూక్ష్మ పరిశీలకులు 8 మంది విధులు నిర్వహిస్తారు.17 కేంద్రాలకు గాను ఒక్కొక్క కేంద్రానికి ఇద్దరు చొప్పున పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు.రెండు జోన్లుగా ఏర్పాటు చేసి 7 రూట్ లను నిర్వహిస్తున్నారు.ప్రతి బూతుకు 2 బ్యాలెట్ బాక్సులు ఉండగా 10 బ్యాలెట్ బాక్సులు రిజర్వు ల్లో ఉంచుతారు. మున్సిపాలిటీలోని 12 వార్డుల మొత్తం ఓటర్ల సంఖ్య 14383 మంది ఉండగా,అందులో పురుషులు 7106,మహిళలు 7277 ఉన్నారు.

- Advertisement -

రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరగడానికి పోలింగ్ ఉన్నత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ సమావేశంలో మోత్కూర్ మున్సిపల్ కమిషనర్ కే.సతీష్ కుమార్,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News