Friday, March 6, 2026
Homeహైదరాబాద్‌మణికొండ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు సకల సవలతులు

మణికొండ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు సకల సవలతులు

  • టౌన్ ప్లానింగ్ అధికారి మెడికల్ లీవ్
  • డతాత్కాలిక అధికారి మనోహర్ చుట్టపు చూపు
  • నాలుగేసి మున్సిపాలిటీలు అప్పగింతలు
  • చోద్యం చూస్తున్న సి డి ఎం ఏ అధికారులు

మణికొండ మున్సిపాలిటీలోని అలాపూర్ గోల్డెన్ వ్యూ కాలనీ సర్వేనెంబర్ 9 మరియు 10లో అక్రమ నిర్మాణాలకి డ్రైనేజ్ లు వేస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ అధికా రులు. అక్రమానికి సక్రమం చేయడం కోసం మణికొండ ఇంజనీర్ డిపార్ట్మెంట్ సకల సవలతులు చేస్తున్నారు. అల్జాపూర్ విలేజ్ సర్వే నెంబర్ 9 మరియు 10లో గోల్డెన్ వ్యూ కాలనీలో భారీ నిర్మాణాలు చేస్తున్న వారికి మణికొండ కొందరు రాజకీయ నాయకుల అండదండలతో బిల్డర్స్ చెలరేగిపోతున్నారు.

ప్రజా ప్రతినిధులకు భారీ ఎత్తున చేతులు తడిపారు స్థానిక బిల్డర్స్. ఇంకేముంది మమ్మల్ని టచ్ చేసేది ఎవరు అంటూ డ్రైనేజ్ లైన్ తవ్వకాలతో పాటు అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిని అడ్డుకోవలసిన మున్సిపల్ అధికారులు వారికి వత్తాసు పలకడం తో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఎప్పటినుంచో ఉన్న ఇండ్ల మధ్యలో డ్రైనేజ్ లైన్స్ వేయడం చేత కాదు కానీ అక్రమ నిర్మాణాలు చేస్తున్న వెంచర్ లో డ్రైనేజీ ఏమిటో అని ముక్కున వేలు వేసుకుంటున్నారు ప్రజలు. ఇది ఏమైనా అక్రమ నిర్మాణల లో డ్రైనేజి నిర్మాణం వెంటనే నిలిపివేసి ప్రజా ధనం వృధా కాకుండా అధికారులు చూడాలని, ఎవరో రాజకీయ నాయకుల మెప్పుకోసం చేస్తున్న పనులు నిలపాలని ప్రజా నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని కోరుతున్నారు.

దిక్కు దివాణం లేకుండా పోయిన మణికొండ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ జాడ లేకుండా పోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. ఇకనైనా గోల్డెన్ వ్యూ కాలనీలో తగిన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను అడ్డుకొని ఇక్కడ వేస్తున్న డ్రైనేజీ లైన్ని నిలిపివేసి అవసరం ఉన్న చోట వేయాలని ప్రజాధనం వృధా కాకుండా చూడాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News