Thursday, March 26, 2026
Homeనల్లగొండAlair | ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

Alair | ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

  • పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ అక్షాంశు యాదవ్.

ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అక్షాంశు యాదవ్ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాంశు యాదవ్ జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలేరులో నెలకొన్న పరిస్థితులు ఎన్నికల నిర్వహణ తీరును ఎస్పీ స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని సుమారు వందమంది పోలీసులు విధుల్లో ఉన్నారని, ఓటర్లను ప్రేరేపించేందుకు నగదు మద్యం ఆశ చూపే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామని, సమస్యత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిగా పెట్టాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస నాయుడు, సిఐ యాలాద్రి, ఎస్ ఐ వినయ్ కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News