Friday, February 27, 2026
Homeనల్లగొండAlair | ఆలేరు మున్సిపల్ పోరులో వార్ వన్ సైడ్

Alair | ఆలేరు మున్సిపల్ పోరులో వార్ వన్ సైడ్

  • విప్ బీర్ల అయిలయ్య
  • ఆలేరులో కాంగ్రెస్ గెలుపు ఖాయం. 1,8,10,11వ వార్డుల ప్రచారంలో పాల్గొన్న అయిలయ్య, కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభ రాణి,

ఆలేరు మున్సిపల్ లోని 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని ఆలేరు లో ముప్పై ఏళ్ళ తరవాత కాంగ్రెస్ జండా ఎగురవేయాబోతున్నమన్నారు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షులు బీర్ల అయిలయ్య మరియు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణితో కలిసి ఆలేరు పట్టణంలోని 1వ వార్డులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చింతల ఫణి సునీతా శ్రీనివాస్ రెడ్డి, 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జూకంటి సంపత్, 10వ వార్డు అభ్యర్థి మల్లెల సరితా శ్రీకాంత్, 8వ వార్డు అభ్యర్థి పాము అనితాకు మద్దతుగా బుధవారం రోజున ప్రచారం నిర్వహించారు.

ఇంటింటికీ తిరిగి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆలేరు పట్టణం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఆలేరు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పూర్తవుతుందని త్వరలోనే ఆలేరును రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

ఆలేరు మున్సిపల్లో కాంగ్రెస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే కొత్త మున్సిపల్ భవనం పాత గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎక్కడైతే ఉందొ అక్కడే కొత్త భవనాన్ని నిర్మించుకుందామని అన్నారు. ఆలేరు ను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తానే స్వయంగా తీస్కుంటానని తెలిపారు.

1వ వార్డు 10వ వార్డు 11వ 8వ వార్డు అభ్యర్థులను గెలిపించాలని బుధవారం ప్రచారం కోరిన అయిలయ్య. ఈ కార్యక్రమంలో ఉమేన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సంజీవ రెడ్డి,టౌన్ అధ్యక్షుడు ఎజాజ్,మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరాజు, మాజీ ఎంపీపీలు అశోక్,,చీర శ్రీశైలం,మాజీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, సాగర్ రెడ్డి నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News