Wednesday, February 11, 2026
Homeసినిమాబీజేపీ అధ్యక్షులు రామ్‌చంద‌ర్‌ను కలిసిన అక్కల సుధాకర్‌

బీజేపీ అధ్యక్షులు రామ్‌చంద‌ర్‌ను కలిసిన అక్కల సుధాకర్‌

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుని సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు అక్కల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం ఆత్మీయతతో సాగింది. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు, సినీ రంగ అభివృద్ధిపై సానుకూలంగా చర్చించుకున్నారు. అక్కల సుధాకర్, రామచందర్ రావు నాయకత్వ శైలిని ప్రశంసించారు.

అలాగే, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించడంలో సినిమా రంగం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు గారు ప్రజలకు చేరువైన విధంగా పనిచేస్తున్నారని, ఆయనకు మరింత శక్తి, విజయాలు కలగాలని అక్కల సుధాకర్ ఆకాంక్షించారు.

- Advertisement -

ఈ భేటీ పారదర్శక రాజకీయాలపై నమ్మకాన్ని, ప్రజాస్వామ్య పటిమను ప్రతిబింబించేదిగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News