- వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ప్రాంతం నుంచి ప్రయాణం..
- సెక్యూరిటీ ఆపరేషన్స్ పరీక్షించిన ఏపీ సింగ్..
సరిహద్దుల్లో సంసిద్దతను భారత వైమానిక దళం ప్రదర్శించింది. భారతీయ వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇవాళ మిగ్-29 యూపీజీ మల్టీరోల్ యుద్ధ విమానాహలో విహరించారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ప్రాంతానికి చెందిన ఓ ఎయిర్‌బేస్ నుంచి ఆయన ఇవాళ మిగ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు.
సున్నితమైన సెక్టార్ల వద్ద సెక్యూర్టీ ఆపరేషన్స్ పరీక్షించారు. ఫైటర్ పైలట్ దుస్తుల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ … అప్‌గ్రేడ్ చెందిన మిగ్-29 విమానంలో ఒంటరిగా సోర్టీ నిర్వహించారు. ఐఏఎఫ్ మిగ్-29 దళంలో అత్యాధునిక వర్షన్‌కు చెందిన మిగ్-29 యూపీజీ మోడల్ యుద్ధ విమానం జత కూడింది.
- Advertisement -
