సైబర్ నేరాలు కొత్త ఎత్తుగడల్లో డిజిటల్
అరెస్టు పేరుతో జనాన్ని భయపెట్టి, కోట్ల
రూపాయల దోపిడి చేస్తూ.. సైబర్
సెక్యూరిటీకి,పాలకులకు సవాల్గా
మారారు!. డబ్బు అధికారాలను మంచికి
చెడుకి ఉపయోగించినట్లే, కృత్రిమ మేధ
(ఏఐ)కి రెండుముఖాలున్నాయి. మంచి
చేస్తేవరం, చెడుతలపెడితే నేరం. ఏఐ
నైపుణ్యాన్ని నేరగాళ్లు దోపిడీకి ఆయుధంగా
మార్చుకున్నారు! సైబర్ మోసాలకు,
నేరగాళ్లకు సమర్థంగా చెక్ పెట్టాలంటే? ఆ
సాంకేతికతోనే ముల్లును ముల్లుతోనే
తీయాలన్న సామెతల ఏఐ నైపుణ్యంతోనే
సమర్థంగా కంట్రోల్ చేయవచ్చు. కృత్రిమమేధ
(ఏఐ) మానవ ప్రగతికి తోడ్పడాలేగాని,
భస్మాసుర హస్తంగా మారకూడదు.
- మేదాజీ
- Advertisement -
