స్మార్ట్ఫోన్లలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం పెరుగుతోంది.. అదే వేగంతో మన ఆరోగ్యం,ఆర్థిక భద్రత క్షీణిస్తోంది! ఆన్లైన్ ట్రేడింగ్ ముసుగులో.. “స్వల్ప పెట్టుబడి-భారీ లాభం” అంటూ ఫేక్ వాయిస్, ఫేక్ వీడియోలతో సైబర్ కేటుగాళ్లు అమాయకుల్ని, అతి ఆశాపరుల్ని మోసం చేస్తున్నారు. ప్లాట్ఫాంలపై నమ్మకం పెంచి, ఖాతాలు ఖాళీ చేసే దోపిడీ ఇది!పార్లమెంట్ జరుగుతున్న వేళనే జాతీయ నాయకుల మార్ఫింగ్ వీడియోలు వైరల్ కావడం, వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం కాదా! ఇది కేవలం సాంకేతిక సమస్య కాదు, ప్రజల జీవితాలతో ఆడుకునే నేరం! అప్రమత్తతే రక్షణ.. ప్రభుత్వం తక్షణమే ఏఐ నైపుణ్యం తోనే “కీలెరిగి వాత పెట్టినట్టు” సైబర్ నేరగాళ్లపై కఠినంగా కట్టడి చర్యలు చేపట్టాలి! ప్రజలు కూడా మోసాల పట్ల జాగ్రత్త పడాలి!
- మేదాజీ
- Advertisement -
