Wednesday, February 11, 2026
Homeనల్లగొండPRA | చివ్వేంల రైతు వేదికలో అగ్రికల్చర్ విద్యార్థులు పిఆర్ఏ.

PRA | చివ్వేంల రైతు వేదికలో అగ్రికల్చర్ విద్యార్థులు పిఆర్ఏ.

చివ్వేంల రైతు వేదికలో అగ్రికల్చర్ విద్యార్థులు పిఆర్ఏ (Participatory Rural Appraisal) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గడ్డిపల్లి కె వి కె నుండి శాస్త్రవేత్తలు ఏ. కిరణ్, ఏ నరేష్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రైతులతో పరస్పర చర్చలు నిర్వహించి, వారి పంటల్లో ఎదురయ్యే సమస్యలను తెలుసుకుని శాస్త్రీయ పరిష్కారాలను సూచించారు.

రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పంటల సంరక్షణ, వ్యాధులు, పురుగుల నియంత్రణ, నీటి నిర్వహణ తదితర అంశాలపై విలువైన సూచనలు పొందారు.రైతులు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. అగ్రికల్చర్ విద్యార్థులు కె. మౌనిక, వి. రమ్య, జి. శ్రీనిజ, కె. రోషిణి, జి. సాగర లక్ష్మీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News