Tuesday, February 10, 2026
Homeకెరీర్ న్యూస్Braou | త్వరలో వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులు

Braou | త్వరలో వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులు

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కొత్తగా వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులను(Agriculture-Based Vocational Courses) త్వరలోనే ప్రారంభిస్తామని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చెప్పారు(Ghanta Chakrapani). వచ్చే విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయం వృత్తి నైపుణ్య, వ్యవసాయ ఆధారిత కోర్సులు అందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ తెలంగాణ విద్యార్థులకు(Rural Telangana Students), రైతుల(Farmers)కు మేలు జరిగేలా ఈ కోర్సులను రూపొందిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీలో చదివే విద్యార్థులను మొదటి సెమిస్టర్ నుంచే కార్పొరేట్ కంపెనీలకు(Corporate Companies) అవసరమయ్యేలా టెక్నాలజీపరంగా, ఇతర అంశాల్లో తీర్చిదిద్దుతూ, ప్రపంచవ్యాప్తంగా అన్ని కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా పలు కోర్సులను ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News