Wednesday, March 4, 2026
Homeఅంతర్జాతీయంDeals | ఇండియా, జర్మనీ ఒప్పందాలు

Deals | ఇండియా, జర్మనీ ఒప్పందాలు

ఇండియా(India), జర్మనీ(Germany) మధ్య సోమవారం పలు ఒప్పందాలు కుదిరాయి. ఆర్థికం, భద్రత, రక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సంబంధాల బలోపేతం కోసం ఈ ఒప్పందాలపై సంతకం చేశాయి. గుజరాత్‌లోని గాంధీనగర్‌(Gandhi nagar)లో మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఇండియా, జర్మనీ CEOల ఫోరం సమావేశం(CEOs Forum Meeting)లో ప్రధాని మోదీ(PM Modi), జర్మన్ ఛాన్సలర్(German Chancellor) ఫ్రెడరిక్ మెర్జ్ (Friedrich Merz) సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. దక్షిణాసియా దేశమైన ఇండియా, యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ.. చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్‌లో ఇండియాకి జర్మనీ అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అని పేర్కొన్నారు. ఆ సంబంధాలను విస్తరించాలని కోరుకుంటున్నట్లు ఇద్దరు నాయకులు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News