నటుడనేవాడు ఏ క్యారెక్టర్ లో నైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో జీవిస్తూ ప్రేక్షకుల మనసులో జీవించే వారు కొందరే ఉంటారు. అప్పట్లో అరుంధతి సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న నటుడు సోనూసూద్. ఆ కోవలోనే టాలీవుడ్ కు అచ్చతెలుగు విలక్షణ నటుడు “దక్షిణ కాళి”చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు. అతను మరెవరో కాదు అఫ్సర్ ఆజాద్. గతంలో బాలకృష్ణ కాంబినేషన్లో శ్రీమన్నారాయణ, అధినాయకుడు, ప్రభాస్ కాంబినేషన్ లో చక్రం, అల్లరి నరేష్ కాంబినేషన్ లో సీమ టపాకాయ్,జగపతి బాబు కాంబినేషన్ లో అధినేత చిత్రాలలోనే కాకుండా, తమిళ్ లో హీరోగా రెండు చిత్రాలు నల్లవనం ఇలై కేటవనం ఇల్లే, పోయే ఏనుగు పోయే లతో పాటు, బోజ్పూరి లో విలన్ గా నిరహువ ద లీడర్,నిరహువ ఆటోవాలా చిత్రాలతో పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు.

అలాగే రీసెంట్ గా వచ్చిన “రాజా సాబ్” చిత్రం లో నటించారు. అలా నటన కే పరిమితం కాకుండా పలు రకాలుగా పేదవారికి సహాయం చేయడానికి “ఆజాద్ ఫౌండేషన్” ను స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు అఫ్సర్ ఆజాద్. ఇలా సోనూసూద్ లా నటన పరంగా , సమాజ పరంగా బాధ్యతలు నిర్వహిస్తున్న అజాద్ తాజాగా ” దక్షిణ కాళి” చిత్రం లో ఓ మాంత్రికుడి పాత్రలో కనువిందు చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత సోనూసూద్ కి అరుంధతి లానే తనకు కూడా మంచి గుర్తింపు వస్తుందని, అలాగే తెలుగులో రియల్ స్టార్ శ్రీహరి గారంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన లాగే మరెన్నో వైవిద్యమైన పాత్రలు పోషించాలని ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు అఫ్సర్ ఆజాద్.



