సికింద్రాబాద్, జనవరి 30(ఆదాబ్ హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) భూగోళశాస్త్ర విభాగం(Department of Geography) ఆధ్వర్యంలో అడ్వాన్స్‌డ్ అకడమిక్ ట్రైనింగ్(Advanced Academic Training) డీజీపీఎస్, టోటల్ స్టేషన్ అంశంపై వర్క్‌షాప్(Workshop) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విభాగాధిపతి ప్రొఫెసర్ టి.అనురాధ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ బి.నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంజనీర్ డి.నరసింగరావు రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో డీజీపీఎస్ పరికరం ద్వారా భూసర్వే కచ్చితత్వం, తక్కువ సమయంలో సర్వే చేసే విధానాలు, అలాగే టోటల్ స్టేషన్ ద్వారా పెద్ద ప్రాజెక్టులు, క్లిష్ట ప్రాంతాల్లో సర్వే పద్ధతులను విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ అనురాధ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక క్షేత్రస్థాయి పరిజ్ఞానం అందించడమే లక్ష్యమని చెప్పారు. ప్రొఫెసర్ నగేష్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఫీల్డ్ అనుభవం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, పరిశోధన, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే.. వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ భూగోళశాస్త్ర విద్యార్థినిలు కూడా పాల్గొని ఆధునిక సర్వే పరికరాలపై అవగాహన పొందారు.
