Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణ9 సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు అదనపు సిబ్బంది

9 సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు అదనపు సిబ్బంది

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ధరణి స్థానంలో భూభారతి అమల్లోకి వచ్చాక స్లాట్‌ బుకింగ్‌ విధానంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పనిభారం పెరిగింది. దీంతో ప్రభుత్వం ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించింది. పటాన్‌చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాలలో వీరు అందుబాటులోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్‌ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్‌ బుకింగ్‌ కారణంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులపై పని భారం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజల రద్దీ, పనిభారం ఉన్న 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అదనపు సబ్‌ రిజిస్ట్రార్లతోపాటు ఇతర సిబ్బందిని నియమించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News