99 రోజుల ప్రణాళికలో భాగంగా మామడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజు మెరుగైన పారిశుధ్యం కొనసాగించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు.
“ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” కింద చేపట్టిన 99 రోజుల కార్యక్రమాలలో భాగంగా, గురువారం ఉదయం మామడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో ఆసుపత్రులు, కార్యాలయాలు, వీధులు, అన్ని ప్రాంతాలలో పరిశుభ్రతను కొనసాగించాలని చెప్పారు. పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగించాలని వివరించారు. ఆసుపత్రి ప్రాంగణం మొత్తం శుభ్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటే, చికిత్సల కొరకు వచ్చే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


