Tuesday, March 24, 2026
Homeహైదరాబాద్‌Addagutta | ప్రజలకు దూరంగా భారమైతున్న లాలాగూడ పోలీస్ స్టేషన్

Addagutta | ప్రజలకు దూరంగా భారమైతున్న లాలాగూడ పోలీస్ స్టేషన్

  • అడ్డగుట్టను యథావిధిగా తుకారాంగేట్ పీఎస్ పరిధిలో కొనసాగించాలి- కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి
  • అడ్డగుట్ట హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తో కదం తొక్కిన అడ్డగుట్ట ప్రజలు
  • స్పందించిన చిలకలగూడ ఏసిపి శశాంక్ రెడ్డి

తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అనేక ప్రాంతాలను లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేర్చడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు.అడ్డగుట్ట హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చంద్రయ్య హోటల్ నుంచి తుకారాంగేట్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ,పునర్విభజన ప్రక్రియలో భాగంగా తుకారాంగేట్ పీఎస్ పరిధిలో ఉన్న అడ్డగుట్ట ప్రాంతాలను లాలాగూడ పీఎస్ పరిధిలోకి మార్చడం వల్ల ప్రజలు అనవసరమైన అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు.చిన్న సమస్యకైనా దాదాపు రెండు కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని,సరైన రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు.

- Advertisement -

అందువల్ల అడ్డగుట్ట ప్రాంతాలను యథావిధిగా తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసనలో అడ్డగుట్ట హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీకి ప్రయత్నాలు–ఏసీపీ శశాంక్ రెడ్డి

అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ప్రతినిధులు అందజేసిన వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకుని,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహన చేసుకున్నామని చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి తెలిపారు.ప్రజల ఆకాంక్ష మేరకు అడ్డగుట్ట ప్రాంతాన్ని తిరిగి తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చేందుకు ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.ఈ విషయంలో స్థానిక సంఘాలు,ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News