రూ.10 లక్షలున్న బ్యాగ్‌తో పారిపోగా పట్టుకున్న పోలీసులు
కూకట్‌పల్లి డివిజన్ ఏసీపీ ఇ.రవికిరణ్
హైదరాబాద్, నవంబర్ 14 (ఆదాబ్ హైదరాబాద్): దృష్టి మళ్లింపుల నేరాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు (Police) అదుపులోకి తీసుకొని (Arrest) రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీ (Kphb Colony) స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. కేసు వివరాలను ఏసీపీ ఇ.రవికిరణ్, ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజశేఖర్‌రెడ్డి, డీఐ.కే.ఎస్.రవి, డీఎస్‌ఐ అబ్దుల్ సమద్‌తో కలిసి వెల్లడించారు.
నాగర్‌కర్నూల్‌కి చెందిన ముదావత్ శంకర్(26) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ (Auto Driver). ఉపాధి కోసం నగరానికి వచ్చి సూరారం కాలనీలో ఉంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 7న రాత్రి అడ్డగుట్ట సొసైటీ కేపీహెచ్‌బీ కాలనీ, దారి నుంచి ఒక వ్యక్తి తన కారులో వెళుతుండగా వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో గాయపడ్డాడు. అదే దారి నుంచి కారు వెనక వస్తున్న శంకర్.. ప్రమాదం గుర్తించి వెంటనే ఆటో ఆపి బాధితుడుకి సాయం చేశాడు. సనత్ నగర్ కాలనీ ఆటోగ్యారేజ్ సెవంత్ గేర్ టోగ్యారేజ్‌కు తరలించాడు. దీంతో బాధితుడు డి.ఉత్తమ్‌కుమార్ వర్మ తనను ఇంటి వద్ద దింపాలని ఆటోడ్రైవర్‌ను కోరాడు. దానికి అతను సరేనన్నాడు.
ఆటోలో ఇంటికి వెళుతున్న క్రమంలో బాధితుడి దృష్టి మళ్లించి రూ.10 లక్షలు ఉన్న అతని బ్యాగ్‌తో (Money Bag) ఉడాయించాడు. బాధితుడు తన సెల్‌కి ఫోన్ చేయగా నిందితుడు స్వీచ్ ఆఫ్ చేశాడు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దారిలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. శంకర్.. చిత్తారమ్మ టెంపుల్ గాజులరామారం వద్ద ఉన్నాడని సమాచారం అందింది.
పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుణ్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారణ జరపగా నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి నగదు రూ.5,32,000, ఆటో స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుణ్ని పట్టుకున్న క్రైం టీం సిబ్బంది సురేష్, రాఘురాం, రాంచందర్ తదితరులకు రివార్డు కోసం పేర్లు ప్రతిపాదించినట్లు ఏసీపీ తెలిపారు.
