Wednesday, February 11, 2026
Homeక్రైమ్ వార్తలుMu*der Case | నిందితుడికి రిమాండ్‌

Mu*der Case | నిందితుడికి రిమాండ్‌

డీసీపీ కే.సురేష్‌కుమార్‌ వెల్లడి

హైదరాబాద్‌, నవంబర్‌ 14 (ఆదాబ్‌ హైదరాబాద్‌): హత్య కేసు నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌ జగద్గిగిరిగుట్ట స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. కేసు వివరాలను బాలానగర్‌ జోన్‌ డీసీపీ కే.సురేష్‌కుమార్‌, బాలానగర్‌ ఏసీపీ పి.నరేష్‌రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్‌ బి.వేంకటేశం, సీసీఎస్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రవికుమార్‌,ఎస్‌.ఒ.టి, టీం తో కలిసి వెల్లడించారు.

- Advertisement -

ఖమ్మంకు చెందిన యర్రమాల నిహారిక (21) భర్త దేవేందర్‌తో కలిసి మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా వేంకటేశ్వర నగర్‌ కాలనీలో నివసిస్తున్నారు. అదే ఉరికి చెందిన బోగ్గుల శివ మాధవరెడ్డి(21) ఇంజనీరింగ్‌ విద్యార్థి. మృతురాలికి పరిచయం ఉంది. అయితే నిందితుడు శివమాధవరెడ్డికి చెడు అలవాట్లు ఉండేవి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌(Online Betting)కు బానిసయ్యాడు. మత్తు పదార్థాలు సేవించడం, చెడు వ్యసానాలకు అలవాటు పడ్డాడు. ఇతను భర్త (Husband) లేని సమయంలో మృతురాలి ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు. ఈమె వద్ద బంగారు నగలు (Gold Ornaments) ఉన్న విషయం తెలుసుకొని ఎలాగైనా ఆమె అడ్డు తొలగించి వాటిని దోచుకోవాలని పథకం వేశాడు.

ఈ నెల 12న భర్త, ఇంటి చుట్టు పక్కాల ఎవరూ లేని సమయంలో మృతురాలి ఇంటికి వచ్చాడు. ఎవరూ లేరని గుర్తించి నిందితుడు ఆమెను ఉపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ప్రమాదవశాత్తు బాత్‌రూం(Bathroom)లో జారిపడిపోయి మరణించిందని నమ్మించడానికి ఆమెను అక్కడే వదిలేసి పడక గది(Bed Room)లోని విలువైన బంగారు వస్తువులు తీసుకుని పారిపోయాడు. దొంగలించిన బంగారు నగలను మణప్పురం ఫైనాన్స్‌ లిమిటెడ్‌‌(Manappuram Finance Limited)లో తాకట్టు పెట్టి 3,06000 డబ్బు తీసుకున్నాడు. అయితే ఒక గృహిణి అనుమాన స్థితిలో మరణించిన సమాచారం పోలీసులకు తెలియడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని శవపంచనామ అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఆ దారిలో సీసీటీవీ కెమెరాలను క్షుణంగాపరిశీలించి నిందితుడి ఆచూకీ కనుగొన్నారు.

నిందితుడు బొగ్గుల శివ మాధవరెడ్డి ఉన్న ప్రదేశానికి వెళ్లి చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ఇతని వద్ద నుంచి బుల్లెట్‌ వాహనం, మొబైల్‌ ఫోన్లు 2, రక్తపు మరకలు ఉన్న బట్టలు, వాటర్‌ గ్లాస్‌, బంగారం తాకట్టు పెట్టిన చిట్టీ తదితరాలను స్వాధీనం చేసుకొని వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News