Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణమంత్రి ఉత్తమ్‌కుమార్‌ కాన్వాయ్‌కు ప్రమాదం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌ కాన్వాయ్‌కు ప్రమాదం

తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌(Uttam Kumar Reddy) కాన్వాయ్‌కు శుక్రవారం ప్రమాదం జరిగింది. హుజూర్‌నగర్‌ నుంచి జాన్‌పహాడ్‌ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా.. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. 8 కార్ల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. మంత్రి ఉత్తమ్‌కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో భద్రతా సిబ్బంది, నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కొంతసేపు ఆందోళన నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News