- గూడూరులో ఒకరు, శంషాబాద్ పరిథిలో ఇద్దరు..
- ఒకరు స్కూల్ అసిస్టెంట్, మరో ఇద్దరు పోలీసులు..
అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు చిక్కారు. ఉదయం మహబూబాబాద్ మండలం గూడురు గ్రామంలో ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ పట్టుబడగా తాజాగా శంషాబాద్ పరిధిరో సర్కిల్ ఇన్స్‌పెక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్ ఏసీబీ వలకు చిక్కారు. శంషాబాద్ పరిధిలోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసులో అరెస్టు చేయకుండా కేసు నుంచి తప్పించడానికి లంచం తీసుకున్న ఇద్దరు పోలీసు అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
రాజీవ్ గాంధీ విమానశ్రయం పోలీసు అవుట్ పోస్టులో సీఐగా పనిచేస్తున్న యూ.కె సిద్దేశ్వర్, ఎస్సై సంపతి కనకయ్య రూ. 2 లక్షలు తీసుకుంటుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ కేసులో చార్జిషీట్, అరెస్టు చేయకుండా చూడాలని బాధితుడు కోరగా వారు రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో మొదటి విడతగా రూ.2 లక్షలు ఒప్పందం జరిగి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
