Friday, October 3, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలునూనె శ్రీధర్ నివాసాలపై ఏసీబీ దాడులు

నూనె శ్రీధర్ నివాసాలపై ఏసీబీ దాడులు

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్‌ నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లోని cad డివిజన్ 8(చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంప్ కార్యాలయం)లో పనిచేస్తున్నారు. నూనె శ్రీధర్‌కు సంబంధించిన 20 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆయన తన విభాగంలోని పలు ప్రాజెక్టులను నచ్చినవారికి కట్టబెట్టి వందల కోట్లు సంపాదించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నూనె శ్రీధర్‌కు సంబంధించి హైదరాబాద్‌లో ఆరు చోట్ల, బెంగళూరులో నాలుగు చోట్ల, కరీంనగర్‌లోని ఇళ్లలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. కరీంనగర్‌లోని కాలేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయంతోపాటు 9 చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. శ్రీధర్ బంధుమిత్రులు, కుమారుడితోపాటు సన్నిహితుల ఇళ్లలోనూ సెర్చింగ్‌ చేస్తున్నారు. ఈయన.. కాళేశ్వరంలోని కీలకమైన గాయత్రీ పంప్‌హౌజ్ బాధ్యతలు చూశారు. గత ప్రభుత్వం గాయత్రీ పంప్‌హౌజ్‌లను బాహుబలి మోటార్లుగా భావించింది. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో వాటిని నిర్మించింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News