తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ..వేల సంవత్సరాల చరిత్ర గల బతుకమ్మ పండుగను తెలంగాణలో ప్రజలు భక్తితో తొమ్మిది రోజులు జరుపుకునే ఓ వేడుక..ఎంగిలి బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు ఊరు వాడ ఆడపడుచుల ,ఆట పాటలతో కోలాహలం..తెలంగాణ సమాజంలో నవాబులు, భూస్వాముల చేతిలో ప్రాణాలు విడిచిన వారిని, పువ్వుల రూపంలో గుర్తు చేసుకుంటూ, బతుకమ్మ బతుకమ్మ అంటూ తలుచుకుంటూ ఆడిపాడిన పండుగ విశిష్టే ఈ బతకమ్మ అని ఎందరికి తెలుసు…బతుకమ్మ తెలంగాణ అస్తిత్వం.. బతుకమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, బతుకమ్మ తెలంగాణ పోరాటానికి ఒక చిహ్నం..అంతటి ప్రాముఖ్యత గల బతుకమ్మను భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం రేపటి తరాలకు బతుకమ్మ గొప్పతనాన్ని చాటుదాం..
-కుమ్మరి రాజు