మన హృదయాంతరాల్లోని అజ్ఞాన చీకట్లను తొలగించి, మన చుట్టూ ఉన్న జీవితాలకు ప్రేమ కాంతిని పంచాల్సిన “సుదినం-దీపావళి” (Diwali). మనిషిలోని “నేను” అనే అహం(Ego), భ్రమ తొలగిపోవాలి. “నాది” అనే స్వార్థం (selfishness) అడుగంటాలి. మనలోని ఆత్మదీపానికి జ్ఞానం అనే చమురు అందిస్తే, నిత్యం కాంతులే. ఇతరులు అందించే వెలుతురుపై ఆధారపడితే అది పరాధీనతే. నీలోని దీపాన్ని నువ్వే వెలిగించుకో! అప్పుడే మనిషి “స్వయంప్రకాశ దీపం” అవుతాడు. “చీకటి పోదేమో” అనుకోవడం నిరాశ. “వెలుతురే ఉండాలి” అనుకోవడం దురాశ. మనిషి జీవితం చీకటి-వెలుగుల సమాహారం. సుఖ-దుఃఖాల మార్పును సవినయంగా స్వీకరించడం అనివార్యం. సంక్షోభ సమయంలో ఆత్మవిశ్వాస (Self Confidence) దీపాన్ని వెలిగించుకోవడమే వివేకవంతుల లక్షణం. ఈ దీపావళికి మనమంతా మానవతా దీపాన్ని వెలిగిద్దాం.
- మేదాజీ
