Saturday, February 28, 2026
Homeఆజ్ కీ బాత్Political Leaders | రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి ఏది?

Political Leaders | రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి ఏది?

ఉపఎన్నికల (Bye Elections) ఉత్సాహం, ఊరేగే రాజకీయం(Politics), పార్టీల మార్పులు, పదవుల పిచ్చి యుద్ధం, కసిగా వలసలు, కుర్చీల వేటలు, ప్రజాసంక్షేమంపై వీరికి ఏల ఈ ఛాదస్తం? ఎమ్మెల్యే రాజీనామా (Mla Resignation).. రేపు ఉపపోరు. అభ్యర్థుల (Candidates) వేటలో నాయకులకు ఎంతటి తీరిక. మీకొక్కటే కావాలి. ఈ నేలపై అధికారం(Power). మరి మట్టిలో కలిసే ఆ మనిషి బతుకెందుకు అంధకారం? నిగ్గదీసే నిజాలు.. ఆకలి కేకలు వేసే పేద బతుకులా?.

ప్రభుత్వ దవాఖానాల గోడల వెనక వైద్యం (Treatment) అందక ప్రాణాలుపోతున్న దయనీయ దృశ్యం! నిర్జీవంగా పడి ఉన్న ఆ పేద శరీరాల గమ్యం. ఆక్సీజన్ (Oxygen) లేదు. అత్యవసర చికిత్స లేదు. మీ రథయాత్రల దర్పానికి వీరికి చోటే లేదు. రేపటి పౌరుల భవితవ్యం వింటున్నారా? మట్టిగోడల బడి. విద్యకు దక్కని సరైన సౌలభ్యం. పునాదుల్లేని శిథిల భవనాలు, అంధకారపు గమ్యం. కుర్చీ కోసం కోట్లు కుమ్మరించే మీకు బడికి నాలుగు గోడలు, బాల్యానికి నాణ్యమైన చదువు అందించే చిత్తశుద్ధి (sincerity) ఎక్కడ?

  • సౌరం జితేందర్
- Advertisement -
RELATED ARTICLES

Latest News