ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామా రావు, డిప్యూటీ సీఈవో శిరీష పాల్గొని క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ, ప్రజలు, ప్రభుత్వం మధ్య వారధిగా పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
ప్రజల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక అంకితభావంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. నిజాలను నిర్భయంగా, హుందాతనంతో దృశ్యరూపంలో ప్రజల ముందుకు తీసుకు వస్తున్న పత్రికగా ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. భవిష్యత్తులో మరింత నాణ్యమైన వార్తలతో ముందుండి ప్రజల ఆదరాభిమా నాలను సంపాదించాలని ఆకాంక్షించారు.
ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ స్టోరీలు, సంచలన కథనాలతో ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు, సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సుధాకర్, ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక జిల్లా ప్రతినిధి శిగ సురేష్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు బంటు కృష్ణ, ఎరుకల సైదులు గౌడ్, షేక్ జానీ పాషా, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
