పండగ పూట ఫైజాబాద్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.ప్రమాదవశాత్తు చెరువు(కుంట)లో పడి యువకుడు మృతి చెందిన సంఘటన చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపింది.పోలీసుల కథనం ప్రకారం..గురువారం చిలిపిచేడ్ మండలంలోని ఫైజాబాద్ గ్రామానికి చెందిన చాకలి బాలేష్(30)ఉపాధి కోసం కుద్బుల్లాపూర్ మండలంలోని బోరంపేటలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.పండగ కోసం అని గత మూడురోజుల క్రితం గ్రామానికి వచ్చాడు.గ్రామంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారి ముందర ఉన్న పూజ సామాగ్రి కొత్త బట్టల్లో చుట్టి చెరువు(కుంట)లో వేయడానికి వెళ్ళిన బాలేష్ ప్రమాదవశాత్తు కాలుజారి కుంటలో పడి మృతి చెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.దసరా పండగ రోజు యువకుడు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.బాలేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతుడికి భార్య విమల కూతురు నక్షత్ర,కుమారుడు అక్షయ్ ఉన్నారు.భార్య విమల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నర్సింలు తెలిపారు.