Saturday, October 4, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్వారికి అశ్రునివాళి

వారికి అశ్రునివాళి

గాలి మోటర్ ఎక్కి గగనతలంలో ప్రయాణిస్తున్నవారి ప్రాణాలు పోయిన సంఘటన యావత్ ప్రపంచాన్ని పాపం అనేలా చేసింది. గమ్యం చేరుకునే లోపే గాలిలో కలిసిపోయిన ప్రజల ప్రాణాలు.. దివి నుంచి భువి మీదకు కూలిన గాలి మోటర్ సాంకేతిక లోపంతో శవాల కుప్పలుగా మారే.. ఎగిసిపడిన మంటల్లో మాంసపు ముద్దలు ఎవరివో తెలియక కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆకాశానికి చేరే.. గాలి మోటర్ ఎక్కని అమాయక ప్రజల ప్రాణాలు కూడా పోయి గాయాలపాలైరి. ఎందరో జీవితాలు గాలిలో కనురెప్పపాటున కనపడకుండా పోయినవారికి అశ్రునివాళి. మీ కుటుంబ సభ్యులు ఈ బాధాకరమైన సంఘటన నుంచి బయటపడేలా మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నా.

  • ముచ్కుర్ సుమన్ గౌడ్
RELATED ARTICLES
- Advertisment -

Latest News