Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఆదాబ్ ప్రత్యేకంమదమెక్కిన ఎస్సీ కార్పోరేషన్..!

మదమెక్కిన ఎస్సీ కార్పోరేషన్..!

  • అంబేద్కర్ చిత్ర పటానికి అవమానం..
  • తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ కార్యాలయం చెత్తలో అంబేద్కర్ చిత్ర పటం
  • కార్పోరేషన్ అధికారులకు ఎందుకింత మదం!
  • పూజలు అందుకోవాల్సిన స్థలంలో భారత రత్న ప్రతిమకు అగౌరవం..
  • అందరూ దళితేతరులే.. అందుకేనా ఈ బలుపు!

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని కార్యాలయ కారిడార్ చెత్తలో పడేసిన ఘటన తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తోంది. దళితుల ప్రేరణామూర్తి చిత్ర పటం చెత్తలో పడి ఉండటం జీర్ణించుకోలేక ‘ఆదాబ్’ ఆ చిత్రాన్ని ప్రపంచానికి చూపే ప్రయత్నం చేసింది. దళితుల కోసం ఏర్పాటు చేసిన సంస్థలోనే ఇలాంటి అవమానం క్షేమించరాని నేరం. కార్యాలయ అధికారులకు ఇది తగదని, ఇది ముమ్మాటికీ అధికారుల మదమేనని దళిత సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.

పూజలు అందుకోవాల్సిన స్థలంలో, ప్రతిష్టాత్మకంగా గౌరవించాల్సిన ప్రతిమను చెత్తలో పడేయడం దళితుల ఆత్మ గౌరవంపై దాడితో సమానం అని వారు అంటున్నారు. ప్రపంచం మొత్తం సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా ఆయన ప్రతిమను ఆవిష్కరించుకుంటుంది. అయన ప్రఖ్యాతిని ప్రతిబింబించేలా తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిలిపి, సచివాలయానికి ఆయన పేరును నామకరణం చేస్తూ తెలంగాణ తన ఆత్మగౌరవాన్ని మరోసారి నలుదిక్కులా చాటుకుంది. ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ను కీర్తిస్తుంటే, ఆయన పుణ్యామాని ఏర్పడిన సంస్థలో ఉద్యోగాలు నిర్వహిస్తూ, లక్షల జీతాలు తీసుకుంటూ చివరికి ఆ మహానుభావున్ని అవమానించే నీచ స్థితికి ఇక్కడి అధికారులు దిగజారడం శోచనీయం. దీనంతటికి కారణం ఒక్కటేనని తెలుస్తోంది. ఇక్కడ ఒక్క దళిత అధికారి కూడా లేకపోవడం, అర్హత కలిగిన దళిత అధికారులను రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి రానివ్వకుండా రాజకీయాలు చేయడం, దళితేతర అధికారులంతా ఒక్కటై ఈ విధమైన రోత పనులకు ఇక్కడ ఆద్యం పోస్తున్నారని తెలిసింది. ఈ కార్యాలయానికి మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక దళిత అధికారి ఉండి ఉంటే, అంబేద్కర్ చిత్రపటానికి ఈ విధమైన అవమానం జరిగి ఉండేది కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు. దళితుల కోసం ఏర్పాటైన కార్పొరేషన్‌లోనే ఈ విధమైన నిర్లక్ష్యం జరగడం, ఈ సంస్థలోని అధికారుల మనస్తత్వాన్ని బహిర్గతం చేస్తోంది.

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని అధికార వ్యవస్థలో కొన్ని వర్గాలు ఇంకా అంబేద్కర్ ఆత్మను, ఆయన సమానత్వ సిద్ధాంతాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోవడం వల్లనే ఇలాంటి బలుపు కార్యక్రమాలు, కులవివక్ష ఆరోపణలు అవతరిస్తుంటాయని దళిత బహుజన మేధావులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌లో పైస్థాయి అధికారుల ప్రవర్తనపై గతంలోనూ విమర్శలు వచ్చాయి.
కార్పొరేషన్‌లో దళితుడు చైర్మన్‌గా ఉన్నా, నిర్ణయాధికారాలు ఎగువ కులాల అధికారి చేతుల్లోనే ఉంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

భాద్యులను వెంటనే సస్పెండ్ చెయ్యాలి:
ఈ కార్యాలయానికి మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారిణి వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వలన కూడా ఇలాంటి సంఘటనలకు ఒక కారణం కావొచ్చు అని దళిత నాయకత్వం భావిస్తోంది. రాజ్యాంగ ఫలితంగా దళితులకు దక్కిన ఎస్సి కార్పొరేషన్ లోనే అంబేద్కర్ ను గౌవరవించలేదంటే ఇక దళితులను ఇక్కడి అధికారులు ఏ విదంగా చూస్తారో అర్ధం అవుతోంది. ఇక్కడ ఒక్క దళిత అధికారి లేకపోవడం శోచనీయం. సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము
– బైరి వెంకటేష్, ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు

రేవంత్ రెడ్డి ఫొటో నెత్తిమీద పెట్టుకొని, రాజ్యాంగ నిర్మాత ఫోటోను చెత్తలో వేశారు. ఇది అధికారుల వైఖరి కన్నా పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా భావించాలి. ఈ విషయంలో క్రింది స్థాయి సిబ్బందిని, అటెండర్లపై చర్యలు తీసుకో కుండా ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ను తక్షణమే సస్పెండ్ చెయ్యాలి.
– విశారాధన్ మహారాజ్, దళిత బహుజన మేధావి

RELATED ARTICLES
- Advertisment -

Latest News