Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Congress Party | బీసీ మేధావుల మద్దతు కోసం వినతి

Congress Party | బీసీ మేధావుల మద్దతు కోసం వినతి

  • జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి
  • తమ డిమాండ్లు పరిష్కరించాలన్న బీసీ మేధావులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో తమ అభ్యర్థి నవీన్ యాదవ్‌(Naveen Yadav)కు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రతినిధులు శనివారం హైదరాబాద్ డీడీ కాలనీలోని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కార్యాలయానికి వచ్చి విజ్ఞప్తి చేశారు. బీసీ మేధావులు, బీసీ సంఘాల (BC Unions) నేతల మద్దతు కోరారు. ఈ బృందంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి(Mayor Gadwala Vijayalakshmi), ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరపత్రి అనిల్, ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Gnaneshwar Mudiraj), సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వినయ్ కుమార్ ఉన్నారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధినేతలు టి.చిరంజీవులు(Chiranjeevulu), బాలగౌని బాల్‌రాజ్‌గౌడ్‌లతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ఫోరం ఛైర్మన్ టి.చిరంజీవులు మాట్లాడుతూ కేంద్రానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి, ప్రధానమంత్రితో సంప్రదింపులు జరిపి, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కృషిచేయాలని కోరారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీసీ వాదాన్ని బలపరచడంలో భాగంగా నవీన్ యాదవ్‌కి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

బీసీలను 3 పార్టీలు మోసం చేస్తున్నాయని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఛైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ హామీలను అమలుచేసేందుకు ప్రత్యేకంగా చొరవ చూపాలని అన్నారు. బీసీ కులవృత్తులకు సంబంధించి బడ్జెట్ విడుదల చేసేందుకు ఒత్తిడి తేవాలని కోరారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు చెప్పిన పలు అంశాల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌ గెలుపు కోసం బీసీ నేతలంతా కృషిచేయాలని ఈ సందర్భంగా ప్రతినిధులు విన్నవించారు. ఈ చర్చల్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ఎస్.దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నేతలు చాపకూర రాజు, కెవి గౌడ్, ఎర్రమాద వెంకన్న, రాపోలు జ్ఞానేశ్వర్, ఒంటెద్దు నరేందర్, అవ్వారు వేణు, గోర శ్యాంసుందర్, భైర శేఖర్, లింగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News