- ఎంవీ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ స్వామి
- తుకారాంగేట్ లో యూత్ కమిటీ మీటింగ్
అడ్డగుట్ట: బాల్యవివాహాలను(Child Marriages) అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, బాల్య వివాహం జరిగిన 3ఏళ్ల వరకు కూడా రద్దు చేయవచ్చని ఎంవీ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ స్వామి తెలిపారు. మారేడ్ పల్లి మండలం తుకారాంగేట్ బస్తీలో గురువారం జరిగిన యూత్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంపైన అవగాహణ కల్పించారు.

బాలకార్మిక రహిత సమాజం కోసం తీసుకోవాలసిన చర్యలను వివరించారు. బాల్యవివాహాలు(Child Marriages) చేయడం వలన జరిగే నష్టాలు, బాల్య వివాహాల నిర్వాహకులకు ఎటువంటి శిక్షలు ఉంటాయనే అంశాలను తెలిపి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లి చైతన్య పరచాలని సూచించారు. ఈ సమావేశంలో యూత్ సభ్యులు రాకేష్, మైత్రి, ప్రవళిక, విష్ణు, దివ్య, రోహన్, వైష్ణవి, బాలల హక్కుల పరిరక్షణ వేదిక (సీఆర్పీఎఫ్) మండల కన్వీనర్ ప్రవీణ్, ఎం వీ ఫౌండేషన్ ఆర్గనైజర్లు ఆర్ లత, సుమలత పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
