Homeహైదరాబాద్‌Shiv Pratap Shukla | వైవిధ్యాన్ని, చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి

Shiv Pratap Shukla | వైవిధ్యాన్ని, చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి

  • సాంస్కృతిక వారధులుగా విద్యార్థులు నిలవాలి: విద్యార్థులకు గవర్నర్‌ సూచన
  • ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’లో భాగంగా అస్సాం బృంద విద్యార్థులతో ముఖాముఖి

హైదరాబాద్‌: విద్యా పర్యటనల్లో షాపింగ్‌, వినోదానికే పరిమితం కాకుండా ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా(Shiv Pratap Shukla) సూచించారు. పర్యటించిన ప్రాంతాల విశిష్టతలను తెలుసుకుని, ఆ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌–యువ సంగమం ఫేజ్‌-7’లో భాగంగా అస్సాం బృందం ( Assam Contingent) నుంచి తెలంగాణకు వచ్చిన 72 మంది సభ్యుల విద్యార్థి బృందంతో గురువారం ఉదయం లోక్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో గవర్నర్‌ ముఖాముఖి నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చార్మినార్‌ చరిత్ర, గోల్కొండ కోట నిర్మాణంలోని సాంకేతికత, తెలంగాణ భాష, ఆహారపు అలవాట్లు, పండుగల ప్రత్యేకతలను తెలుసుకోవాలని సూచించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అక్టోబరు 23 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న యువ సంగమం కేవలం విహారయాత్ర కాదని, జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశమని పేర్కొన్నారు. దేశంలోని భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు, జీవన విధానాలను పరస్పరం తెలుసుకోవడమే ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’ ప్రధాన ఉద్దేశమన్నారు.

WhatsApp Image 2026 10 29 at 3.04.12 PM 1

అస్సాం, తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని బలోపేతం చేయాలని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణకు, తెలంగాణ వైశిష్ట్యాన్ని ఈశాన్య రాష్ట్రాలకు పరిచయం చేసే సాంస్కృతిక వారధులుగా విద్యార్థులు నిలవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో తమ పర్యటన అనుభవాలను విద్యార్థులు గవర్నర్‌తో పంచుకున్నారు. రాష్ట్ర ఆతిథ్యం, హైదరాబాద్‌ సాంకేతిక అభివృద్ధి తమను ఆకట్టుకున్నాయని తెలిపారు.

కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్‌, సంయుక్త కార్యదర్శి కొమండూరు శశి కిరణ్‌, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం నోడల్‌ అధికారి డా. ఎస్‌. అరుళ్మొజి, ఇతర అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News