HomeతెలంగాణCongress Leadership | కొండా దంపతులకు కీలక పదవులు..?

Congress Leadership | కొండా దంపతులకు కీలక పదవులు..?

  • కొండా సురేఖకు డిప్యూటీ స్పీకర్‌..?
  • కొండా మురళికి ఆర్టీసీ చైర్మన్‌ పదవి..?
  • ఇద్దరికీ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్‌ యోచన?

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కీలక పదవులు కట్టబెట్టేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం(Congress Leadership) పరిశీలన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కొండా కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ దంపతుల్లో ఒకరికే పదవి ఇస్తారా..? లేక ఇద్దరికీ కీలక బాధ్యతలు అప్పగిస్తారా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇటీవల కొండా సురేఖ మాట్లాడుతూ.. తన భర్తకు పదవి ఇస్తామని పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు వెల్లడించినట్లు సమాచారం. అయితే, ఒక్క పదవితోనే సరిపెట్టకుండా సురేఖకు సైతం మరో కీలక బాధ్యత అప్పగించే అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఒకరికి ఒక పదవి..?

కొండా సురేఖకు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవి, కొండా మురళికి ఆర్టీసీ వంటి కీలక సంస్థకు చైర్మన్‌ పదవి ఇచ్చే అవకాశాలపై చర్చ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది…అయితే, సురేఖ మాత్రం మరింత ప్రాధాన్యమున్న పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. శాసనసభ స్పీకర్‌ పదవి లేదా టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే ఆకాంక్షను ఆమె అధిష్ఠానం ముందుంచే అవకాశం ఉందన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.

- Advertisement -

కొండా కుటుంబాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేని కాంగ్రెస్‌..?

కొండా సురేఖను పార్టీలో కొనసాగించడంతో పాటు, ఆమె రాజకీయ ప్రాధాన్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం(Congress Leadership) ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2027 జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలనే అంశంపై ఏఐసీసీ దృష్టి సారిస్తున్న నేపథ్యంలో.. వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం పార్టీ వ్యూహంలో కీలకంగా మారిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేతగా, బీసీ మహిళా నాయకురాలిగా కొండా సురేఖకు వరంగల్‌ ప్రాంతంలో ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆమె పార్టీకి దూరమైతే బీసీ వర్గాల్లో ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ పరిణామాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్‌ వంటి ప్రతిపక్షాలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం కూడా లేకపోలేదని కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయపడుతోంది.ఈ మేరకు కొండా దంపతులకు చెరో కీలక పదవి కట్టబెడుతారా? లేక కొండా సురేఖ కోరుకుంటున్నట్లు అత్యున్నత బాధ్యతను అధిష్ఠానం అప్పగిస్తుందా..? లేక ప్రత్యామ్నాయ పదవులతో సర్దుబాటు చేస్తుందా..? అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News