HomeసినిమాVishwadev New Film | విశ్వదేవ్ హీరోగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్

Vishwadev New Film | విశ్వదేవ్ హీరోగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్

“35 చిన్న కథ కాదు” సినిమా ఫేమ్ విశ్వదేవ్ హీరోగా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు.(Vishwadev New Film) ఈ సినిమా శ్రీ తులసి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా రాబోతోంది. “ముఖచిత్రం” సినిమా ఫేమ్ దర్శకుడు గంగాధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో నర్సి రాజగిరి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.  

ఈ రోజు మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ చేశారు. ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో న్యూ టాలెంటెడ్ డైరెక్టర్ నర్సి రాజగిరి ఈ సినిమాను రూపొందించే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. “ముఖచిత్రం” వంటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గంగాధర్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతుండటం విశేషం. ముఖచిత్రం సినిమా దర్శకుడిగా గంగాధర్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమాతో ఆయన అందరి ప్రశంసలు పొందారు.

- Advertisement -

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

నటీనటులు – విశ్వదేవ్, తదితరులు

టెక్నీషియన్స్
——————–
బ్యానర్ – శ్రీ తులసి క్రియేటివ్ వర్క్స్
ప్రొడ్యూసర్ – గంగాధర్
స్క్రిప్ట్ , డైరెక్టర్ – నర్సి రాజగిరి
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)

- Advertisement -
RELATED ARTICLES

Latest News