Homeఆదిలాబాద్Indiramma Houses | దిమ్మదుర్తిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

Indiramma Houses | దిమ్మదుర్తిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

  • దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి మంజూరు చేయాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో ఇళ్లు లేని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses ) అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.

శనివారం దిమ్మదుర్తి గ్రామంలో కలెక్టర్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి నిబంధనల ప్రకారం ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

గ్రామంలో పలు ఇళ్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) విషయంలో సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని వెంటనే గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో విజయ్‌కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News