- కల్వకుంట్ల కవితకు నమ్మిన తమ్ముడు.. నిఖార్సైన నాయకుడు..
- నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో శ్రీకాంత్..
- పట్టభద్రుల గళం అవుతానంటున్న.. సామాన్యుల కష్టాలు తెలిలిసిన లీడర్..
అరుణ – యాకయ్య లకు.. కౌసల్యాదేవి పల్లి గ్రామం నరసింహులాపేట మండలంలో సామాన్య, మధ్యతరగతి గౌడ సామజిక వర్గంలో జన్మించారు.. శ్రీకాంత్ గౌడ్.. భార్య : శ్వేతా.. కూతురు : చిరంజీవి సుదీక్ష (బబ్లీ ).. నలమాస శ్రీకాంత్ గౌడ్(Dr Nalamasa Srikanth Goud) వారి నాన్న గారి పని రీత్యా వారి అమ్మమ్మ గారి ఊరు అయినా ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారం గ్రామంలో కుటుంబంతో స్థిరపడ్డారు..
ఆయన జన్మించిన కౌసల్యదేవి పల్లి లో మూడవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు.. నాలుగవ తరగతి అమ్మమ్మ గారి ఊరిలోని చిన్న నాగారం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో చదివారు.. తరువాత ఇనుగుర్తి లోని ప్రభుత్వ పాఠశాలలో 5,6 వ తరగతి చదువు కున్నారు.. 7 వ తరగతి నుండి జమాడ్లపల్లి లోని విద్యభారతి గురుకులంలో పదవ తరగతి వరకు హాస్టల్ లో ఉండి చదువుకున్నారు.. ఇంటర్ /డిగ్రీ విద్య మహబూబాబాద్ లోని విజ్ఞాన భారతి జూనియర్ డిగ్రీ కళాశాలలో చదివారు..


కొంత కాలం నెల్లికుదురు లోని గీతాంజలి పాఠశాలలో సోషల్ టీచర్ గా పని చేశారు.. తాను పోస్ట్ గ్రాడ్యువేషన్ కోసం కాకతీయ యూనివర్సిటీ లో క్యాంపస్ సిట్ సాధించి మాస్టర్ అఫ్ టూరిజం మేనేజ్మెంట్ లో సిట్ పొంది పీజీ పూర్తి చేసుకున్నారు.. తదనంతరం వచ్చిన తెలంగాణ మలి దశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగ క్రియాశిలక పాత్ర పోషించారు.. హిస్టరికల్ మాన్యుమెంట్స్ ఫర్ ది ప్రమోషన్ అఫ్ టూరిజం ఇండస్ట్రీ అనే అంశం పైన పరిశోదనా డాక్టర్ టి.దయాకర్ రావు పర్యవేక్షణ లో పూర్తి చేసి 2016 లో కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టరెట్ పట్టాను పొందారు..


విద్యార్థి రాజకీయాలు : తాను స్కూల్ దశనుండే అనేక సంస్కృతిక కార్యక్రమాలలో ముందు ఉండేవారు ఇంటర్ మీడియట్ లోకి వచ్చాక ఎస్ ఎఫ్ ఐ లాంటి వామ పక్ష స్టూడెంట్ యూనియన్ లో ప్రభావ వంతంగా పని చేసారు డిగ్రీ లో తెలంగాణ స్వ రాష్ట్ర ఆకాంక్ష కోసం బీ.ఆర్.ఎస్. స్థాపించిన టి.ఆర్.ఎస్.వి. లో మానుకోట ప్రాంతం నుండి పని చేసారు. యూనివర్సిటీ కి వచ్చాక టి.ఆర్.ఎస్.వీ. యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యత చేపట్టి విద్యార్థి సమస్యలపైన అలుపెరుగనిపోరాటం చేశారు..

2009లో మలి దశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి 09 రోజులు అన్న పానీయలు ముట్టకుండా కాకతీయ గడ్డ పైన ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలించారు ఒక దశలో శ్రీకాంత్ గౌడ్ ఆరోగ్యం క్షిణించడంతో అప్పటి పోలీస్ లు శ్రీకాంత్ గౌడ్ దీక్షను భగ్నం చేసి వరంగల్ సెంట్రల్ జైల్ కి తరలించిన సెంట్రెల్ జైల్ లో కూడ దీక్షను కొనసాగించారు. 2009లో ఉద్యమాన్ని ఉవ్వేతున్న లేపిన సంఘటనలో శ్రీకాంత్ గౌడ్ పోరాటం చరిత్రత్మకం.. తరువాత వరంగల్ జిల్లాలో జాగృతి సంస్థను స్థాపించాలని చూస్తున్న సమయంలో పరిశోదక విద్యార్థిగా ఉన్న శ్రీకాంత్ గౌడ్ గురుంచి తెలుసుకున్న కల్వకుంట్ల కవిత ఆయన్ను జాగృతి లోకి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు నాడు ఏకశిల పార్క్ లో సుమారు పది వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహణ చేసి తెలంగాణ జాగృతి విద్యార్థి పోరు సభను నిర్వహించి జాగృతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థాపించటంలో క్రియాశీలకంగా పని చేశారు..


ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గల్లో కమిటీ లు వేసి అనతికాలం లోనే ప్రధాన విద్యార్థి సంఘాల సరసన జాగృతి విద్యార్థి సమాఖ్య టి.జె.ఎస్.ఎఫ్. ని నిలిపి జేఏసీలో భాగస్వామ్యంగా పని చేసారు.. కాకతీయ యూనివర్సిటీ టీఎస్ జాక్ కి కో ఆర్డినేటర్ గా పని చేశారు.. ఇలా అంచాలంచాలుగా కేవలం పనిని నమ్ముకొని సంస్థ లక్ష్యాలకోసం పని చేశారు..
ఈ క్రమం లో అదే యూనివర్సిటీ లో పరిశోధకురాలిగా ఉన్న మారిపెల్లి శ్వేతను కులాంతర వివాహం పెద్దలందరిని ఒప్పించి చేసుకున్నారు.. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన శ్వేత కూడా నాడు ఉద్యమంలో శ్రీకాంత్ గౌడ్ తో భాగస్వామ్యం అయ్యి పనిచేసారు.. 2014లో తెలంగాణ స్వరాష్ట్రము సాధించాక కల్వకుంట్ల కవిత బీ.ఆర్.ఎస్ తరపున ఎంపీగా అరగ్రేటం చేస్తున్న సమయంలో శ్రీకాంత్ గౌడ్ కు కవిత నమ్మకంగా అతి పెద్ద బాధ్యతను వారి ఎన్నికల్లో బాల్కొండ ఇంచార్జి గా బాధ్యతలు ఇచ్చారు.

సుమారు 100 మంది తన అనుచరులతో వెళ్లి బాల్కొండలోని నాటి 5 మండలాలలో శ్రమించి కవిత కు 7 అసెంబ్లీ సిగ్మెంట్స్ ఉంటే అత్యధిక మెజారిటీ 45,000 సాధించిన సిగ్మెంట్ బాల్కొండ కావటం విశేషం.. పని చేయటం మొదలు పెడితే మనస్సు పెట్టి పకడ్బందీగా పని చేసే విధానానికి మెచ్చిన కవిత శ్రీకాంత్ గౌడ్ ను హన్మకొండ నుండి హైదరాబాద్ కి రావాలని కోరారు.. రాష్ట్ర విద్యార్థి బాధ్యతలు తీసుకొని పని చేయాలని నాడు ఆదేశించగానే వారి సతీమణి శ్వేత అప్పటికే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నా కవిత అక్క కోసం, సంస్థ కోసం నాడు ఉన్న ఉద్యోగానికి కూడ రిలీవ్ చేసుకొని హైదరాబాద్ కు వచ్చారు శ్రీకాంత్ గౌడ్..
నమ్మిన నాయకురాలి కోసం ఆది నుండి హనెస్ట్ గా, సిన్సియర్ గా పని చేయటం అలవాటుగా మార్చుకున్న శ్రీకాంత్ గౌడ్ ఎంతో మంది విద్యార్థి నాయకులను తయారు చేసారు.. నాడు శ్రీకాంత్ గౌడ్ తయారు చేసి సంస్థకి అందించిన నాయకులు ఇప్పుడు కవిత పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ ఉండటం శ్రీకాంత్ గౌడ్ పని తనానికి నిదర్శనం.. బతుకమ్మ పండుగల నిర్వహణ, తరువాత మెయిన్ జాగృతికి రాష్ట్ర కార్యదర్శి గా, కవిత నిజామాబాద్ పార్లమెంట్ కు ఇంచార్జ్ గా వివిధ దశల్లో తాను ఫుల్ టైమర్ గా సంస్థ కోసం పని చేసారు..

ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యమకారుడిగా సంస్థలో సీనియర్ గా ఉన్న నాటి బీ.ఆర్.ఎస్. ప్రభుత్వంలో ఎలాంటి అవకాశం దక్కలేదు.. అయినా తన ప్రయాణాన్ని ఆపకుండా కవితకు అండగా నిలుస్తూ వచ్చారు.. కవిత విషయంలో బీజేపీ పెట్టిన తప్పుడు కేస్ కు బలి అయిన కవిత కష్టంలో ఉన్నప్పుడు అప్పటి వరకు కవిత దగ్గర పెద్ద నాయకులుగా చలామణి అయ్యి అన్ని రకాలుగా లాభం పొందిన నాయకులు ఒక్కో క్కరుగా కవితని వదిలి వారి దారి వారు చూసుకున్నారు.
అప్పుడే శ్రీకాంత్ గౌడ్ నిర్ణయించుకున్నారు పరిస్థితులు బావున్నప్పుడు అందరూ ఉంటారు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కకు అండగా ఉండాలని అనుకున్నారు.. తన సామర్ధ్యానికి ఇంకా పదును పెట్టి కవితకు అండగా నిలుస్తూ.. పదునైన తన వాగ్దాటితో ప్రత్యార్థుల విమర్శలకు సమాధానం చెప్తూ.. కవిత పైన ఆరోపణలు చేసే అనేక మంది నోర్లు ముపించారు శ్రీకాంత్ గౌడ్.. పార్టీ నుండి కవితను బయటకు పంపించాక దాడి మరింత తీవ్రం అయ్యింది.. అయినా వెరవకుండా.. వెన్ను చూపకుండా.. ఫ్రంట్ లైన్ వారియర్ గా శ్రీకాంత్ గౌడ్ పని చేసిన తీరే ఈరోజు ప్రజల్లోకి తన మాటను బలంగా తీసుక పోయింది.. ఎన్నో అటుపోట్లు, ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు అన్నిటిని తట్టుకొని నమ్మిన నాయకురాలికి అత్యంత విశ్వాస పాత్రుడిగా నిలిచిన తీరు నేటి యువతరానికి ఖచ్చితంగా ఆదర్శం..
పట్ట భద్రుల గళం అవుతా :
తెలంగాణ రక్షణ సేన పార్టీ అభ్యర్థి గా, కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల బిడ్డగా, బహుజన వారసుడిగా బలంగా ఈ ఎన్నికల్లో కలిసి వచ్చే సంఘాలతో, పట్టభద్రులతో, నిరుద్యోగ, ఉద్యోగ సంఘాలతో, ప్రజాస్వామిక వాధులతో బలంగా ఈ ఎన్నికల్లో కొట్లాడి పట్ట భద్రుల గొంతుక అవుతాను. ప్రశ్నిస్తా అని చెప్పి స్వప్రయోజనం కోసం పాలకుల కు దాసోహం అయ్యిన తీన్ మార్ మల్లన్నను చూసారు.
మీ ఓట్లు దండుకొని నాడు గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రయివేట్ యూనివర్సిటీ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యన్ని నెలకొలపుకున్నాడు, మీరు బీ.ఆర్.ఎస్.ను గెలిపిస్తే ఓరిగింది ఏంటిది.. మల్లారెడ్డికి, రాజేశ్వర రెడ్డికి, వరదా రెడ్డిలకు ప్రయివేట్ యూనివర్సిటీలు వచ్చినాయి.. మరి నిరుద్యోగికి ఏం వచ్చినై..? జీవోల పేరుతో జీవితాలను నాశనం చేసిళ్ళు, పేపర్ లీక్ లతో భవిష్యత్ ఆశలను లీక్ చేసిళ్ళు, రిటైర్మెంట్ వయస్సు నాలుగేళ్లు పెంచి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిల్లు.. బీ.ఆర్.ఎస్. హయంలో 07 ప్రయివేట్ యూనివర్సిటీ లు ఇచ్చిళ్లు, కాంగ్రెస్ 14 డిండి యూనివర్సిటీలను ఇచ్చింది, బడుగు బలహీన వర్గాలు చదువుకునే 14 ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ, వ్యాపారం చేస్తున్న బీ.ఆర్.ఎస్., కాంగ్రేస్ కి ఓటస్తారా? మీ పక్షం ఉండి మీలో ఒకడిగా ఉండి కొట్లాడే ఉద్యమకారుడు, బీసీ బిడ్డకు ఓట్లేస్తారో మీరే విజ్ఞతతో ఆలోచన చేయాలని అన్నారు శ్రీకాంత్ గౌడ్..

కనీసం ఇంటర్మీడియెట్ మూల్యాంకనము కూడా పారదర్శకంగా నిర్వహించని ఈ పార్టీలు కావాలా, గురుకులాల్లో మరణ మృదంగం మన బిడ్డలు పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు ఇవ్వని ప్రభుత్వం, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ హామీ ఇచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న కాంగ్రెస్ కి ఓట్లు అడిగే అర్హత ఉన్నదా..? ఆలోచన చేయాలి.. గందరగోళంగా జీవోలు, వయస్సు సడలింపులు, జాబ్ వేకెన్సిలను చూపకుండా జాబ్ క్యాలెండర్ పేరుతో నయవంచన చేస్తున్న ఈ ప్రభుత్వం నేల దిగి వచ్చి నా అన్నదమ్ముల కలలను నిజం చేసేలా దిక్కులు పిక్కటిల్లేలా కవిత అక్క నాయకత్వంలో భారీ ఉద్యమాన్ని నిర్మిస్తాను.
అడగంది ఎవ్వరు ఏమి చెయ్యరు, మీ తరపున అడిగేటోడు కావాలి, ప్రశ్నించే వాడు కావాలి, రోహిత్ వేముల సెంట్రెల్ యూనివర్సిటీ స్టూడెంట్ చనిపోతే నాడు రాహుల్ గాంధీ వచ్చి చేసిన ప్రామిస్ ఈ ప్రభుత్వం మర్చిపోయింది.. హెచ్ సి యులో బతుకమ్మ వేడుకలకు వెళ్లి ఈ ప్రభుత్వం మరచిన రోహిత్ వేముల చట్టంని గుర్తు చేసి కవిత ప్రశ్నిస్తే బట్టి విక్రమార్కతో కూడుకున్న మంత్రి బృందం కమిటీ వేసి త్వరలో ఆ చట్టం తెస్తామని చెప్పిళ్ళు.. మొన్న రిమ్స్ ఆసుపత్రిలో నవ జాత శిశువులు చనిపోతే కవిత, మేమంతా సందర్శించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఆదిలాబాద్ రిమ్స్ కు 11 కోట్ల నిధులు ఇచ్చిళ్లు.. పోలీస్ నియామకాల పైన దిల్ షుక్ నగర్ వేదికగా నిరుద్యోగులతో మేము ఉద్యమిస్తే 19000 ఖాళీలకు 7,000 ఖాళీలకు నోటిఫికెషన్స్ ఇచ్చింది.. ఇట్లా అడిగి సాధించేవాడు కావాలి. ఆ గళం మా అక్క చెల్లెళ్ళ, అన్న దమ్ముల పక్షాన నేను అవుతానని ప్రమాణ పూర్తిగా తెలియజేశారు శ్రీకాంత్ గౌడ్..

కడు పేదరికం నుండి :
సొంత ఇల్లు కూడ లేని అతి సామాన్యున్ని.. పూరి గుడిసె నుండి వచ్చిన వాడిని.. పట్టభద్రుల కష్టం తెలిసినోన్ని.. బోర్డర్ గా, నాన్ బోర్డర్ గా యూనివర్సిటీ హాస్టల్ లో ఉండి పరిశోదన పూర్తి చేసి డాక్టరెట్ పొందిన బిడ్డను.. కిరాయి ఇంట్లోనే ఉంటున్నాను. నాకు ఎలాంటి ఆడంబరాలు లేని జీవితం.. బుక్స్ భుజాన పెట్టుకొని సద్ది కట్టుకొని నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాడిని.. సగటు పేద వాడి జీవితం ఎలా ఉంటుందో చూసిన వాడిని.. బస్సు పాస్ కు కూడ డబ్బులు లేని పరిస్థితిలో మా నాన్న గీత వృత్తి ద్వారా కల్లు రెండు రోజులు అమ్మితే కానీ బస్ పాస్ కు డబ్బు జమ అయ్యేది కాదు.
అలాంటి పరిస్థితి నుండి వచ్చిన బిడ్డను.. కట్టెల పొయ్యి, దాని పక్కనే వత్తు కుండా, అందులో కాగిన నీళ్లతో స్నానం చేసుకొని పాఠశాలకు వెళ్లిన అతి సామాన్య పరిస్థితిల నుండి వచ్చిన బిడ్డను.. తాటి కమ్మలతో వేసిన గుడిసె వర్షం వస్తే పది దుక్కుల కురుస్తుంటే గిన్నెలు పెట్టి తెల్లారి పారబోసేటోళ్ళం.. ఈ పరిస్థితిల నుండి వచ్చిన బిడ్డగా నాకు నిరుద్యోగుల బాధలు, పేదరికపు ఈసడింపులు అన్ని అనుభవించి, స్వశక్తితో ఇక్కడి వరకు వచ్చిన బిడ్డను.. అక్కున చేర్చుకొని నా భుజం ఖచ్చితంగా తట్టుతారని నమ్ముతున్న..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
