- నన్ను అడిగేవాడు… ఎవడు రా?
- వివాదాస్పదంగా ఏజన్సీ ఏరీయాలోనీ ఓ ఎస్.ఐ పనితీరు
- సామాన్య ప్రజలపై ఎస్సై దురుసు ప్రవర్తన?
- ఉన్నత అధికారులకు ఫిర్యాదు..చేయనున్న బాధితులు?
ఏటూరునాగారం: ములుగు జిల్లాలోనీ ఏజన్సీ ఏరీయాలో ఏడాది కాలంగా పనిచేస్తున్న ఓ ఎస్సై వ్యవహారశైలి, పనితీరు వివాదాస్పదంగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విధి నిర్వహణలో భాగంగా ప్రశ్నించిన సామాన్య ప్రజల పై సదరు ఎస్సై(Eturnagaram SI) దురుసుగా ప్రవర్తించారని, బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించి అసభ్య పదజాలంతో దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తనపైనే ఆరా తిస్తావా? తన వ్యవహారాలపై విచారణ చేస్తావా? అంటూ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనపై అక్రమ కేసులు పెడతానని బెదిరించారని, అంతేకాకుండా చేయి చేసుకున్నారని సదరు బాదితులు ఆరోపిస్తున్నట్లు సమాచారం.ఇక్కడ “నన్ను ఎవరు ఏమీ చేయలేరు” అంటూ ఎస్సై(Eturnagaram SI) వ్యవహరించిన తీరు ఇప్పుడు పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సామాన్యుడి వద్ద నగదు, మొబైల్ తీసుకున్నారనే ఆరోపణలు
మొబైల్ ఫోన్ లాకొని రూ.5,000 ల నగదును కూడా పోలీసులు బలవంతంగా తీసుకున్నారనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా చట్టవ్యతిరేకoగా వ్యవహరించారనే ఆరోపణలు స్థానికంగా ఆందోళనకు కారణమవుతున్నాయి.
ఉన్నతాధికారులు స్పందించాలి!
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారులే చట్టవిరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఇక్కడ రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాగా ఇదే సమయంలో ప్రశ్నించే పాత్రికేయుల విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం, ఇలా పలు మార్లు జరుగుతుందనీ కొందరు పాత్రికేయులు సైతం వాపోతున్నారు. దాడి చేయడం, వ్యక్తుల వస్తువులు నగదును బలవంతంగా తీసుకోవడం వంటి ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీల నేతలు కోరుతున్నారు.
ఈ ఘటనపై సంబంధిత జిల్లా పోలీసు శాఖ ఉన్నతా ధికారులు తక్షణమే స్పందించాలని, బాధితుల ఫిర్యాదులు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత అధికారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
తరుచు వివాద స్పదమే
మారుమూల ప్రాంతo లోని ఏరియాలో బాధ్యతలు చేపట్టి ఏడాది గడవకముందే తరచూ వివాద స్పదంగా మారుతూ వార్తల్లోకి ఎక్కుతున్న ఆ “ఎస్సై రూటే సపరేటు” అన్న చందంగా తయారైంది.అమాయకులను స్టేషన్ కి పిలిపించి బెదిరింపులకు. భయభ్రాంతులకు గురిచేస్తూ. స్టేషన్లో ముద్దు కేసు కట్టేసి కొట్టిన సంఘటన మరువక ముందే. మండల కేంద్రంలోని ఓ ‘మార్ట్ ” ఎదుట ఆంధ్ర ప్రాంతానికి చెందిన పూల మొక్కల వ్యాపారులను బెదిరించి పూల మొక్కలు తీసుకెళ్లి మరోసారి వార్తల్లోకి సంచలనం సృష్టించారు.
ఆ సంఘటన మర్చిపోకముందే మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న మాఫియాకు వెన్నుదన్నుగా ఉంటున్నారని కూడా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. నన్నే ప్రశ్నిస్తారా అంటూ సామాన్య వ్యక్తులపై జూలం ప్రదర్శించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బిజెపి నాయకుల పై అసభ్యంగా ప్రవర్తిస్తూ కేసులు నమోదు చేస్తా అని బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు కూడా మండలంలో వార్తల్లో ఆ టాపిక్ గా మారిన సంఘటన మరువక ముందే.
ఓ సామాన్య వ్యక్తి మేడారం మోక్కు చెల్లించుకోవడం కోసం నాటు కోళ్లు తీసుకెళ్తున్న సందర్భంలో బెదిరింపులకు పాల్పడి అతని వద్ద ఓ నాటుకోడి పుంజు బలవంతంగా తీసుకున్న సంఘటన వెలుగు చూసింది. పోలీస్ స్టేషన్లో సైతం తోటి ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చర్చనీయాంశంగా మారింది.
నిత్యం వివాదాస్పదంగా మారుతూ పోలీస్ శాఖ కే మచ్చ తెచ్చే విధంగా ఉంది అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా వచ్చిన పలు రకాల ఫిర్యాదుల పై సమగ్ర విచారణ చేసి సదరు వివాదస్పద ఎస్.ఐ పై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ని రామనాథ్ కేకన్ ను ఈ ప్రాoతానికి చెందిన ఆయా గ్రామాల ప్రజలు,మేధావులు, విద్యార్థులు గట్టిగా కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
