HomeజాతీయంEconomic Inequality | ధనిక - పేద అంతరం..

Economic Inequality | ధనిక – పేద అంతరం..

(ఆర్థిక అసమానతలు సమాజంలో మానిపోని గాయం )

“ఎక్కడైనా పేదరికం ఉంటే, అది ప్రపంచానికే ప్రమాదకరం” – పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అసమానతలు పెరిగితే ఆవేదన పెరుగుతుంది… ఆవేదన పెరిగితే అవినీతి, అన్యాయం వేళ్లూనుకుంటాయి..! నేటికీ ఈ మాటలు అక్షరసత్యాలుగా మన కళ్లముందే కాలాడుతూ ఉంటాయి..

- Advertisement -

భారతదేశంలో ఆకలిచావుల నివేదికలు ప్రస్తుతం కనుమరుగైపోవడం సంతోషకరమే. ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ఆకలిని కొంతవరకు తరిమికొట్టి ఉండవచ్చు. కానీ, ఒకవైపు పేదరిక(Economic Inequality)నిర్మూలన మాటలు వినిపిస్తుంటే, మరోవైపు ధనికులకు -పేదలకు మధ్య అగాధం ఆకాశాన్నంటుతుండటం తీవ్రంగా ఆలోచించదగిన వాస్తవం..

కష్టం ఒకటే.. విలువే వేರೆ?

ఒకే కార్యాలయంలో, ఒకే గంటకు విధులకు హాజరై, ఎనిమిది గంటలకు పైగా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మధ్య వేతనాల్లో ఇంతటి వ్యత్యాసం ఎందుకు? ఒక ఉద్యోగికి నెలకు రూ. 8,000 జీతం. అదే కార్యాలయంలో మరో ఉద్యోగికి రోజుకు రూ. 8,000 వేతనం! ఇద్దరూ తమ జీవితంలోని అత్యంత విలువైన సమయాన్ని, యౌవనాన్ని ఆ సంస్థకే అంకితం చేస్తారు. కానీ వారి ఆదాయాల మధ్య ఉన్న దూరం ఆకాశానికీ భూమికీ ఉన్నంత వ్యత్యాసాన్ని తలపిస్తుంది. ఇది కేవలం వేతనాల తేడా మాత్రమే కాదు.. ఇది జీవన ప్రమాణాల మధ్య అంతరం, మనుషుల మధ్య గౌరవాన్ని నిర్ణయించే దారుణమైన వివక్ష..!

నలభై ఏళ్ల క్రితం ఉన్న ఆత్మగౌరవం ఏమైంది?

సుమారు నలభై సంవత్సరాల క్రితం ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నప్పుడు చూసిన దృశ్యం ఇప్పటికీ నా గుండెను పిండేస్తుంటుంది. ఎనిమిదో తరగతి చదివిన ఒక రెగ్యులర్ డ్రైవర్‌కు, డిగ్రీ చదివిన ఒక క్లర్క్‌కు సమానమైన వేతనం ఉండేది. ఎందుకంటే, వారిద్దరూ తమ విధుల్లో సమానమైన శ్రమని, నైపుణ్యాన్ని వెచ్చిస్తున్నారు కాబట్టి! అక్కడ శ్రమకు తగిన గౌరవం ఉండేది.

మరి నేడు పరిస్థితి ఏమిటి?

భారతదేశంలోనే పనిచేస్తూ, ఇక్కడే ఖర్చులు భరిస్తూ.. కొందరికి కనీస జీవనాధారానికి సరిపోని వేతనాలు ఇస్తుంటే, మరికొందరికి అంతర్జాతీయ స్థాయి వేతనాలు చెల్లిస్తున్నారు. నెలాఖరున జీతం చేతికి రాక, పిల్లల ఫీజులు కట్టలేక, రోజూ అప్పులపాలై, ఆకలి కేకల మధ్య బతికే ఒక తండ్రి నుంచి మీరెలాంటి ఉత్సాహాన్ని ఆశిస్తారు? ఆ ఆర్థిక ఒత్తిడి అతని ఆత్మహత్యాయత్నంతో సమానం కాదా?

వ్యవస్థలోని చీకటి కోణాలు – అన్యాయం చేసే గాయాలు – ఆర్థిక అసమానతలు మనిషిని నిస్సహాయుడిని చేస్తాయి.

ఆ ల్యాండ్‌లైన్ ఫోన్ కథ :

దసరా పండుగకు మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ అయిన ఒక వృద్ధుడి ఫోన్‌ను మూడు రోజులు పనిచేయకుండా ఉద్దేశపూర్వకంగా ఆపిన టెలికాం సిబ్బంది నిర్లక్ష్యం.

ఆ ఇరవై రూపాయల దురహంకం :

మున్సిపల్ కార్యాలయంలో పన్ను కట్టిన తర్వాత మిగిలిన రూ.20 చిల్లర ఇవ్వడానికి నిరాకరించి, రసీదు ఇచ్చినందుకే ఏదో ఉపకారం చేసినట్లు చూసిన క్యాషియర్ చూపు. ఇవి చిన్న సంఘటనలు కావచ్చు. కానీ ఒక సామాన్యుడి ఆత్మగౌరవాన్ని కాలరాసే పెద్ద కన్నీటి కథలు! ప్రజా సేవ చేయాల్సిన చేతులు లంచం కోసం చాపినప్పుడు, ఆ వ్యవస్థపై ప్రజలకుండే నమ్మకం కుప్పకూలిపోతుంది.

నిజమైన అభివృద్ధి అంటే ఏమిటి?

దేశం జిడిపిలో దూసుకుపోవడం, బిలియనీర్ల సంఖ్య పెరగడం మాత్రమే అభివృద్ధి కాదు. దేశంలోని అత్యంత సాధారణ పౌరుడు ఎంత భద్రంగా, ఎంత ఆత్మగౌరవంతో బతుకుతున్నాడన్నదే అసలైన అభివృద్ధికి గీత. ధనికుడు మరింత ధనవంతుడు కావడంలో తప్పు లేదు. కానీ, పేదవాడు పూటగడవక మరింత అంధకారంలోకి కూరుకుపోవడం సమాజం సిగ్గుపడాల్సిన విషయం. శ్రమను గౌరవించాలి. ప్రతిభకు తగిన ప్రతిఫలం ఇవ్వాలి. కానీ కనీస మానవతా విలువలు లేని సంపద సమాజానికి శాపమే!

అసమానతలకు హద్దు ఉండాలి!

ధనిక – పేద అంతరం(Economic Inequality) మరణం వరకూ సాగదీయబడే ఒక హింస కాకూడదు. ప్రతి ఉద్యోగి తన కుటుంబానికి గౌరవప్రదమైన భద్రతను ఇచ్చే కనీస వేతనం దక్కాలి. ప్రతి పౌరుడికి చట్టబద్ధమైన సేవలు హక్కుగా అందాలి, ఉపకారంగా కాదు. శ్రమకు విలువ పెరగాలి, నిజాయితీకి పట్టం కట్టాలి. అప్పుడే మన దేశంలో నిజమైన స్వాతంత్రం, అప్పుడే మన ప్రజాస్వామ్యానికి సంపూర్ణ అర్థం!(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News