Homeభక్తిHanuman Chalisa | ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవండి..

Hanuman Chalisa | ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవండి..

  • మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి..
  • ఆధ్యాత్మిక ఏకాగ్రత పెరుగుతుంది..

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో హనుమంతుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీరాముడిపై అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసం, అపారమైన శక్తి, ధైర్యం, తెలివితేటలు, కార్యదీక్షకు హనుమంతుడు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఆయనను ఆరాధించే భక్తులు మంగళవారం, శనివారం మాత్రమే కాకుండా ప్రతిరోజూ హనుమంతుడిని స్మరిస్తుంటారు. హనుమంతుడికి అంకితం చేయబడిన అనేక స్తోత్రాలు, శ్లోకాలలో హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) అత్యంత ప్రాచుర్యం పొందిన భక్తి రచనగా భావిస్తారు.

హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పారాయణం చేయడం వల్ల మనసుకు ధైర్యం కలుగుతుందని, భయాలు తగ్గుతాయని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక బలాన్ని హనుమంతుడి స్మరణ అందిస్తుందని చాలామంది భావిస్తారు. ప్రతిరోజూ చాలీసా చదవడం ద్వారా మనస్సును ఒకచోట కేంద్రీకరించుకోవడానికి, కొంత సమయం ప్రశాంతంగా గడపడానికి అవకాశం లభిస్తుంది. భక్తి భావంతో శ్లోకాలను పఠించడం ద్వారా ఆధ్యాత్మిక ఏకాగ్రత పెరుగుతుందని భక్తులు అనుభవంగా చెబుతుంటారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News