విద్యాబోధనతో పాటు విద్యార్థుల క్రీడా, శారీరక వికాసానికి విశేషంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు గుమ్మిత ఉపేందర్‌రెడ్డిని ఉత్తమ ఉపాధ్యాయుడిగా (Best Teacher Award) ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. మఠంపల్లి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి కె. వెంకటాచారి అధ్యక్షత వహించగా మఠంపల్లి సర్పంచ్ వీరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు విశిష్ట అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ పెదవీడు పాఠశాలలో వ్యాయామ విద్య ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గుమ్మిత ఉపేందర్‌రెడ్డి విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందించేందుకు చేస్తున్న కృషిని వక్తలు ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి ఉపేందర్‌రెడ్డి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ఇలాంటి సన్మానాలు నిర్వహించడం ద్వారా వారిలో మరింత స్ఫూర్తి, బాధ్యత పెరుగుతుందని వక్తలు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొంటూ, గుమ్మిత ఉపేందర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
